Iran Warns US:అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. అమెరికా సైన్యం ఇరాన్‌లోని ఖార్గ్ ద్వీపంపై బాంబు దాడి చేసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఖార్గ్ ద్వీపంలోని సైనిక స్థావరాలపై అమెరికా దాడికి ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఇరాన్ చమురు, ఆర్థిక లేదా ఇంధన సౌకర్యాలపై దాడి జరిగితే వెంటనే స్పందిస్తామని ఇరాన్‌లోని ఖతం అల్-అంబియా సెంట్రల్ హెడ్‌క్వార్టర్స్ ప్రతినిధి పేర్కొన్నారు. ప్రతీకారం అమెరికాతో కనెక్ట్ అయిన వాటిని లక్ష్యంగా చేసుకుంటుందని ప్రతినిధి తెలిపారు.

Continues below advertisement

అమెరికాతో కనెక్ట్ చేసిన మౌలిక సదుపాయాలను నాశనం చేస్తామని బెదిరిస్తూ...

ఇరాన్ సైనిక నాయకత్వం తమ చమురు, ఆర్థిక లేదా ఇంధన మౌలిక సదుపాయాలపై దాడి చేస్తే, అమెరికా కంపెనీలతో కలిసి పని చేసే లేదా వాషింగ్టన్‌తో కలిసి పనిచేస్తున్న ప్రాంతమంతా తమ సర్వైలెన్స్‌ లోకి వస్తుందని పేర్కొంది. ఇరాన్ చమురు, ఆర్థిక లేదా ఇంధన మౌలిక సదుపాయాలపై ఏదైనా దాడి జరిగిన తర్వాత ఇలాంటి మౌలిక సదుపాయాలపై తక్షణ ప్రతీకార దాడి జరుగుతుందని ఖతం అల్-అంబియా ప్రధాన కార్యాలయ ప్రతినిధి తెలిపారు. ఇందులో అమెరికా వాటాలు ఉన్న కంపెనీల సౌకర్యాలు లేదా అమెరికా ప్రాంతీయ కార్యకలాపాలకు మద్దతుదారులుగా ఉండే వారు తమ టార్గెట్ అవుతారని హెచ్చరించింది.  

ఖార్గ్ ద్వీపం ఎందుకు ముఖ్యమైంది? 

అమెరికా సైన్యం 2,500 మంది సైనికులను, ఒక నౌకను మధ్యప్రాచ్యంలో మోహరించాలని ఆదేశించిన సమయంలో ఖార్గ్ ద్వీపంపై దాడి జరిగింది. JP మోర్గాన్ నివేదిక ప్రకారం, ఖార్గ్ ద్వీపం ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు చాలా కీలకం. ఇక్కడ ప్రత్యక్ష దాడి జరిగితే ఇరాన్ ముడి చమురు ఎగుమతుల్లో ఎక్కువ భాగాన్ని వెంటనే నిలిపివేయవచ్చని నిపుణులు అంటున్నారు. వాస్తవానికి, ఇరాన్ చమురులో దాదాపు 90 శాతం ఈ ద్వీపం నుంచి నౌకల్లోకి లోడ్ చేసి ఇతర దేశాలకు పంపుతారు. అందువల్ల, ద్వీపం లక్ష్యంగా చేసుకుంటే, ఇరాన్ ఆర్థికంగా ఇబ్బంది పడనుంది. 

Continues below advertisement

ఇరాన్ హెచ్చరిక 

ఖార్గ్ ద్వీపంలోని ఇరానియన్ చమురు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటే, అది తీవ్రమైన పరిణామాలను కలిగిస్తుందని నిపుణులు అంటున్నారు. దీనికి ప్రతిస్పందనగా, హుర్ముజ్ జలసంధిలోని లేదా గల్ఫ్ దేశాల్లోని చమురు స్థావరాలపై దాడులు చేయవచ్చు. తమ చమురు కేంద్రాలపై స్వల్పంగా దాడి చేసినా అమెరికాకు మద్ధతు ఇచ్చే  ప్రాంతాల్లోని చమురు, గ్యాస్ కేంద్రాలను తగలబెట్టేస్తామని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ఇప్పటికే బెదిరించింది.