Iran Missile Strikes 2026: మధ్య ప్రాచ్యంలో యుద్ధం ఇప్పుడు భయానక స్థితికి చేరింది. గత కొన్ని రోజులుగా ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ జరిపిన దాడులకు ప్రతీకారంగా, ఇరాన్‌ ఇప్పుడు గల్ఫ్‌ దేశాలపై క్షిపణులు, డ్రోన్‌లతో విరుచుకుపడుతోంది. శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత మొదలైన ఈ దాడులు గల్ఫ్‌ దేశాల ఆర్థిక మూలాలపై చమురు కేంద్రాలను లక్ష్యంగా చేసుకోవడం ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. బహ్రెయిన్, సౌదీ అరేబియా, యూఏఈ వంటి దేశాల్లో పేలుళ్ల శబ్దాలతో జనం బెంబేలెత్తిపోతున్నారు. 

Continues below advertisement

బహ్రెయిన్‌లో బాప్కో రిఫైనరీ ధ్వంసం

ఈ దాడుల్లో అత్యంత తీవ్రమైన నష్టం బహ్రెయిన్‌కు వాటిల్లింది. బహ్రెయిన్ ప్రభుత్వ చమురు సంస్థ బాప్కోకు చెందిన రిఫైనరీ కాంప్లెక్స్‌పై ఇరాన్‌ క్షిపణులు దాడి చేయడంతో అక్కడ భారీ ఎత్తున ంటలు చెలరేగాయి. పరిస్థితి చేయి దాటిపోవడంతో బాప్కో తన కార్యకలాపాలకు సంబంధించి ఫోర్స్‌ మెజ్యూర్‌ ప్రకటించింది. అంటే యుద్ధం వంటి అనివార్య కారణాల వల్ల తాము చమురు సరఫరా ఒప్పందాలను ప్రస్తుతానికి నెరవేర్చలేమని ప్రపంచ దేశాలకు స్పష్టం చేసింది. 

కేవలం చమురు కేంద్రాలే కాకుండా, మనామాకు దక్షిణాన ఉన్న సిత్రా నివాస ప్రాంతంలో ఇరాన్‌ డ్రోన్ పడటంతో చిన్న పిల్లలతో సహా సుమారు 32 మంది గాయపడ్డారు. ఇది గల్ఫ్‌ దేశాల్లోని సామాన్య పౌరుల్లో ప్రాణభయాన్ని పెంచుతోంది. 

Continues below advertisement

సౌదీ యూఏఈపై డ్రోన్ల దాడి

సౌదీ అరేబియాలోని అత్యంత కీలకమైన షైబా ఆయిల్‌ ఫీల్డ్ లక్ష్యంగా దూసుకొచ్చిన నాలుగు డ్రోన్‌లను తమ రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నట్టు సౌదీ అధికారులు వెల్లడించారు. అితే, అల్‌- ఖర్చ్‌ గవర్నరేట్‌లోని ఒక నివాస ప్రాంతంలో క్షిపణి పటడంతో ఇద్దు వ్యక్తులు మరణించగా, 12 మంది గాయపడ్డారు. 

యూనైటెడ్‌ అరబ్ ఎమిరేట్స్‌లోని ఫుజైరా ఆయిల్‌ ఇండస్ట్రీ జోన్‌లో కూడా పేలుళ్లు జరిగాయి. కూల్చివేసిన డ్రోన్ల శకలాలు పడటం వల్ల అక్కడ భారీగా మంటలు చెలేగాయి. అటు కతార్, కువైట్‌ దేశాలు కూడా తమ గగనతలంపై డ్రోన్లు ముప్పు పొంచి ఉందని ధ్రువీకరించాయి. 

ఆకాశంలో సైరన్లు మోత 

శనివారం తెల్లవారుజామున 3.15 గంటల సమయంలో గల్ఫ్‌ దేశాలంతటా ప్రమాద హెచ్చరిక సైరన్లు మారుమోగాయి. ఇరాన‌ నుంచి దూసుకు వస్తున్నట్టు క్షిపణులను అడ్డుకునే క్రమంలో సుమారు 12 నుంచి 13 భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయని అల్‌ జజీరా వార్తా సంస్థ వెల్లడించింది. భద్రతా కారణాల దృష్ట్యా గల్ఫ్ ప్రాంతంలోని అనేక దేశాలు తమ గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేశాయి. దీని వల్ల అంతర్జాతీయ విమాన సర్వీసులు పూర్తిగా అస్తవ్యస్తమయ్యాయి. 

ఎందుకీ దాడులు

ఫిబ్రవరి 28 నుంచి ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ జరిపిన దాడులకు స్పందనగానే ఈ దాడులు చేస్తున్నట్టు టెహ్రాన్ ప్రకటించింది. గల్ఫ్‌దేశాల్లో ఉన్న అమెరికా ఆస్తులను వారి మిత్రదేశాలను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా తమ శక్తిని నిరూపించుకోవాలని ఇరాన్ భావిస్తోంది.  హార్ముజ్‌ జలసంధి, గల్ఫ్‌ ప్రాంతంలో చమురు ఉత్పత్తికి ఆటంకం కలగడం వల్ల ప్రపంచ ఇంధన మార్కెట్‌ ఆందోళనలో ఉంది. బాప్కో వంటి సంస్థలు ఉత్పత్తిని నిలిపివేయడం వల్ల రాబోయే రోజుల్లో భారత్‌ వంటి దేశాలకు  చమురు దిగుమతులు కష్టతరం కావచ్చు.