Sania Mirza ex Shoaib Malik over reported split with Sana Javed: పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్,  నటి సనా జావెద్ విడిపోయారని  సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.   పాకిస్తాన్ మీడియా రిపోర్టులు, ఒక వైరల్ వీడియో  కూడా ఈ ప్రచారాన్ని బలపరుస్తోంది.  ఈ జంట జనవరి 2024లో వివాహం చేసుకుంది. సానియాకు విడాకులు ఇచ్చి ఈ పెళ్లి చేసుకున్నాడు షోయుబ్ మాలిక్. తర్వాత  21 నెలల్లోనే వారి  బంధంలో సమస్యలు వచ్చాయని  పాకిస్తాన్ మీడియా ప్రకటించింది. .

Continues below advertisement


షోయబ్ మలిక్, సనా జావెద్ జంట జనవరి 2024లో ప్రైవేట్ గా నిఖా చేసుకున్నారు.    సానియా మిర్జాతో విడాకులు తీసుకుని ఈ పెళ్లి చేసుకున్నారు. షోయబ్ మొదటి వివాహం హైదరాబాద్‌కే చెందిన అయేషా సిద్దీకీతో జరిగింది. అది కూడా విడాకులతో ముగిసింది. ఈ మూడో వివాహం కూడా విడాకులకు దారి తీస్తుందా అనే ఊహాగానాలు పాకిస్తాన్ మీడియాలో వ్యాప్తి చెందాయి.



ఈ ఊహాగానాలకు మూలం  వైరల్ అయిన ఒక చిన్న వీడియో. పాకిస్తాన్ టీవీ ఈవెంట్‌లో షోయబ్, సనా కలిసి కూర్చుని ఉన్నారు. కానీ, వారు ఒకరితో ఒకరు మాట్లాడుకోకపోవడం, స్మైల్ ఇవ్వకపోవడం, మధ్యలో దూరం ఉండటం గమనించారు. షోయబ్ ఆటోగ్రాఫ్‌లు ఇచ్చేసరికి సనా  పట్టించుకోనట్లుగా ఉన్నారు.  ఈ క్లిప్ సోషల్ మీడియాలో "అందరూ బ్రేకప్ మార్గంలో ఉన్నారా?" అనే క్యాప్షన్‌తో షేర్ అయింది. 





అయితే  శుక్రవారం సనా జావెద్ ఇన్‌స్టాగ్రామ్‌లో షోయబ్‌తో కలిసి USA వేకేషన్ ఫోటోలను పోస్ట్ చేసింది.   "లవ్ స్ట్రాంగర్ థాన్ రూమర్స్" అనే క్యాప్షన్‌తో వచ్చింది. కానీ ఇవి పాత ఫోటోలని.. షోయుబ్ మాలిక్  ను నమ్మలేమని కొంత మంది సెటైర్లు వేస్తున్నారు.