Indian influencer finds gravity defying upside down train in Japan Living in 2050: జపాన్ అంటే ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి అంతే కాదు.. టెక్నాలజీ హై ఎండ్ లో వాడేస్తూ ఉంటుంది. అక్కడ ప్రతీది టెక్నాలజీనే. సాఫ్ట్ వేర్ రంగం రాక ముందే అక్కడ టెక్నికల్ గా ఎంతో ముందున్న ఉత్పత్తులు.. హై స్పీడ్ బుల్లెట్ రైళ్లు ఉండేవి.ఇక సాఫ్ట్ వేర్ రంగం ఊపందుంకున్న తర్వాత చెప్పాల్సిన పని లేదు. జపాన్ లో జీవనం టెక్నికల్ గాఎలా ముడి పడి ఉంటుందో ఎన్నో సార్ుల పెద్ద పెద్ద కథనాలు వచ్చాయి. అన్నీ అద్భుతం అనిపిస్తాయి. అయితే అక్కడ ప్రత్యక్షంగా పర్యటించినప్పుడు కలిగే అనుభూతి మాత్రం వేరు. 

Also Read: శబరిమల మకరజ్యోతి కనిపించే ప్రదేశం ఇదే .. ఆ జ్యోతి నిజమా కాదా .. దాని వెనుకున్న సైన్స్ గురించి తెలుసా!

నిజానికి జపాన్ లో ఇలా వేలాడబడి ప్రయాణించే మోనోరైలు చాలా కాలం నుంచి ఆపరేషన్ లో ఉంది. ప్రజా రవణా వ్యవస్థలో చైనా ఎంతో ముందు ఉంది. ప్రపంచానికి బుల్లెట్ రైళ్ల టెక్నాలజీ ఇచ్చింది జపానే అనుకోవచ్చు. ఆ దేశంలో సాధారణ రైళ్ల కంటే బుల్లెట్ రైళ్లు ఎక్కువగా ఉంటాయి. ఇక మెట్రోలు.. ఇతర రవాణా వాహనాల గురించి చెప్పాల్సిన పని లేదు. ఒక్క టాన్స్ పోర్టు మాత్రమే కాదు..జపాన్ ప్రజల జీవన విధానం పూర్తిగా టెక్నాలజీతో ఆధారపడి ఉంటుంది. ప్రతి పని వారు టెక్నాలజీతో ఎెంతో సులువు చేసుకున్నారు.               

ఇప్పుడు ఆ దేశంలో జనాభా విపరీతంగా తగ్గిపోతూండటంతో మ్యాన్ పవర్ సమస్యను పరిష్కరించడానికి ఎప్పుడో ..  రోబోలను రెడీ చేసుకున్నారు. అత్యాధునిక రోబోలు ఇప్పుడు జపాన్ లో ఉంటాయి. అక్కడి ప్రజలు కూడా అంతే క్రమశిక్షణతో ఉంటారు. అందుకే ఆ దేశం ప్రపంచం కన్నా ముఫ్పై ఏళ్లు ముందు ఉందని చెప్పుకుంటున్నారు.     

Also Read:  కొత్త బంగారు గని పాక్ కష్టాలను గట్టెక్కిస్తుందా? - లేక ఆఫ్రికా పరిస్థితే దీనికి కూడా వస్తుందా!