పాకిస్థాన్ ఆప‌ద్ద‌ర్మ ప్ర‌ధానిగా ఆ దేశ మాజీ చీఫ్ జ‌స్టిస్ గుల్జార్ అహ్మ‌ద్ పేరును ఇమ్రాన్ ఖాన్ ప్ర‌తిపాదించారు. జాతీయ అసెంబ్లీని రద్దు చేయడంతో తాత్కాలిక ప్రధానిగా నియమించబోయే వారి పేర్లను ప్రకటించాలని అధ్యక్షుడు అల్వి ఇటీవల లేఖ రాశారు. ఇమ్రాన్‌తో పాటు ప్ర‌తిప‌క్ష నేతకు కూడా ఆ లేఖ‌ను పంపారు.







పార్ల‌మెంట్‌ను ర‌ద్దు చేసిన మూడు రోజుల్లోగా పేర్ల‌ను ప్ర‌క‌టించాల‌ని అధ్య‌క్షుడు అల్వి త‌న లేఖ‌లో కోరారు. దీంతో గుల్జార్ పేరును తాత్కాలిక ప్రధాని ప‌ద‌వికి నియ‌మించాల‌ని ఇమ్రాన్ ప్ర‌తిపాదించారు. అయితే నేషనల్ అసెంబ్లీని రద్దు చేయడంతో 90 రోజుల్లో మళ్లీ ఎన్నికలు జరగనున్నాయి.


గుల్జర్ అహ్మద్.. పాకిస్థాన్‌కు 27వ చీఫ్ జస్టిస్‌గా సేవలందించారు. 2019 డిసెంబర్‌లో ఆ బాధ్యతలు చేపట్టిన గుల్జర్.. 2022 ఫిబ్రవరిన రిటైర్ అయ్యారు.


చివరి బంతి వరకు

 

సంకీర్ణ ప్రభుత్వ సారథిగా 2018 ఆగస్టులో పాక్‌ పాలనాపగ్గాలు చేపట్టారు మాజీ క్రికెటర్‌ ఇమ్రాన్ ఖాన్. పాక్‌ చరిత్రలో ఇప్పటివరకూ ఏ ప్రధాని కూడా అయిదేళ్ల పదవీకాలం పూర్తి చేసుకోలేదు. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ కూడా అదే రూటులో వెళ్లారు. తనపై అవిశ్వాస తీర్మానం పెట్టిన ప్రతిపక్షాలకు ఇన్‌స్వింగ్‌ యార్కర్‌ బంతి వేస్తానని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. అనుకున్నట్లుగానే అవిశ్వాస తీర్మానం ఓటింగ్‌కు రాకుండా చేసి ప్రజాకోర్టులోనే తేల్చుకుంటానన్నారు.

 

నయా పాకిస్థాన్

 

'నయా పాకిస్థాన్‌' నినాదంతో నాలుగేళ్ల కిందట అధికారంలోకి వచ్చిన 'పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఏ ఇన్సాఫ్‌' పార్టీ అధినేత ఇమ్రాన్‌ ఖాన్ ఇప్పుడు తన భవిష్యత్తును ప్రజల చేతిలోనే పెట్టారు. అవిశ్వాసాన్ని ఎదుర్కొనేందుకు తన వద్ద ఒకటి కంటే ఎక్కువ ప్రణాళికలే ఉన్నాయంటూ ఇమ్రాన్‌ ముందు నుంచి చెబుతూనే ఉన్నారు.

 

పాక్‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నించిన 'విదేశీ కుట్ర'కు నిరసనగా శాంతియుత ప్రదర్శనలు చేయాలని దేశ యువతకు పిలుపునిచ్చారు. ప్రదర్శనల్లో ఆర్మీని ఎక్కడా విమర్శించవద్దని ప్రత్యేకంగా కోరారు.

Also Read: Pakistan PM Imran Khan: ఆయన ఓ మెంటల్ కేస్- ఇమ్రాన్ ఖాన్‌పై మాజీ భార్య కామెంట్స్


Also Read: Fact Check : పంజాబ్ కొత్త సీఎం బైక్ దొంగనా ? ఇదిగో నిజం