Humanoid robots are becoming a danger to humanity: ప్రపంచం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ నుంచి ఇంకా ఇంకా ముందుకెళ్తోంది. ఇప్పుడు అంతా హ్యూమనాయిడ్ రోబోల గురించి మాట్లాడుకుంటున్నారు. ప్రతి పనిని ఏఐ లేదా రోబోట్స్ టేకోవర్ చేస్తాయని చెప్పుకుటున్నారు. ఇప్పటికే చాలా పనుల్లో రోబోట్లను వినియోగిస్తున్నారు.కానీ అవి ఎంత ప్రమాదకరంగా మారుతున్నాయో అప్పుడప్పుడు వీడియోలు వెలుగులోకి వస్తున్నాయి.
చైనాలోని ఓ కంపెనీలో హ్యూమనాయిడ్ రోబోను కొన్ని పనులకు వినిపిస్తున్నాయి. అయితే ఇది హఠాత్తుగా మనుషులపై దాడి చేయడం ప్రారంభింది. అతి కష్టం మీద దాన్ని కంట్రోల్ చేశారు. కానీ దాని చేతికి చిక్కి ఉన్నట్లయితే ప్రాణాలు పోయి ఉండేవి.
చైనా నుంచి ఈ వీడియో లీక్ కావడంపై కొంత మంది ప్రశ్నిస్తున్నారు.
ఈ ఘటన ఆధారంగా పలువురు రోబోల వినియోగం, నైతికతపై చర్చలు ప్రారంభించాయి. ప్రపంచ దిగ్గజ టెక్ సంస్థలన్నీ రోబోల తయారీకి ఆసక్తి చూపిస్తూండటంతో ఈ చర్చలు ఆసక్తికరంగా మారాయి.
మనిషిని రోబోట్లు ఎప్పటికీ రీప్లేస్ చేయలేవని కొంత మంది గట్టిగా వాదిస్తున్నారు.
అయితే ప్రపంచంలో మార్పు ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. దాన్ని ఆపడం ఎవరి వల్లకాదు. ఆ మార్పు వల్ల వచ్చే చెడును అధిగమించడానికి చేయాల్సిన ప్రయత్నాలు చేయాలి కానీ.. అసలు మార్పు రాకుండా చేయాలనుకోవడం సాధ్యం కాదని కొంత మంది వాదిస్తున్నారు. రోబోట్లు ప్రమాదకరం కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.