ఆకాశంలో అప్పుడప్పుడూ అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. అలాంటి ఓ అద్భుతం ఇటీవల జరిగింది. అది వీడియోలోనూరికార్డు అయింది. నింగి నుంచి కింద పడిపోతున్న రాకెట్‌ని ఓ హెలికాప్టర్ పట్టుకునే ప్రయత్నం చేసింది. ఈ అద్భుతమైన ప్రయోగాన్ని అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన రాకెట్‌ల్యాబ్ ప్రయోగ సంస్థ చేసింది. ఓ రకంగా చెప్పుకోవాలంటే.. అంతరిక్ష పరిశోధనలకు సంబంధించిన ప్రయోగాలలో ఈ ప్రయోగం గొప్ప మైలురాయి.
ఎలెన్ మస్క్ నిర్వహిస్తున్న రాకెట్ ల్యాబ్ నుంచి ప్రయోగం జరిగింది. అంతరిక్షంలోకి బహుళ ఉపగ్రహాలతో రాకెట్‌ని పంపే ఖర్చుని తగ్గించుకునేలా వాటిని తిరిగి భూమ్మీదకు తీసుకువచ్చేందుకు ఈ ప్రయోగం చేసి విజయం సాధించింది. న్యూజిల్యాండ్‌లో బుధవారం ఉదయం 10.50 గంటలకు అంతరిక్షంలోని కక్ష్యలోకి 34 ఉపగ్రహాలను పంపడానికి బయలుదేరిన బూస్టర్ రాకెట్ ఆకాశంలో ఒకానొక దశలో కొంత ఎత్తుకు చేరి.. ఆ తర్వాత భూమ్మీద పడిపోబోతుంది. అదే సమయంలో తీరంలో సౌత్ పసిఫిక్‌కి సమీపంలో ఉన్న ఒక హెలికాప్టర్ రాకెట్‌ని పట్టుకునేందుకు 22 మైళ్ల దూరంలో ఒక పారాచూట్‌ని వదిలింది. హెలికాప్టర్ పారాచూట్, కేబుల్ వైర్ల సాయంతో ఆ రాకెట్‌ని పట్టుకుంది.
ఆ తర్వాత ఆ రాకెట్ పసిఫిక్ మహా సముద్రంలోకి దూసుకెళ్లింది. ఈ మేరకు ఈ రాకెట్ ప్రయోగం పాక్షికంగా విజయవంతమైంది గానీ ఆ రాకెట్‌ని సముద్రంలో పడకుండా భూమ్మీదకు తేగలిగినట్లయితే పూర్తి స్థాయిలో విజయం సాధించనట్లు అని రాకెట్ ల్యాబ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పీటర్ బెక్ చెప్పారు. ఆ రాకెట్ సురక్షితంగా సముద్రంలోకి వెళ్లిందని, దాన్ని ఓడ సాయంతో తిరిగి తీసుకువస్తామని ప్రకటించారు.