Hamas Chief Ismail Haniyeh: పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే టెహ్రాన్‌లో హతమైనట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ బుధవారం తెలిపారు. హనీయే మరణానికి సంతాపం తెలుపుతూ హమాస్ ఒక ప్రకటన విడుదల చేసింది, "టెహ్రాన్‌లోని అతని నివాసంపై ద్రోహపూరిత జియోనిస్ట్ దాడిలో" మృతి చెందారని ప్రకటన సారాంశం.
హత్యకు ఇంకా ఎవరూ బాధ్యత వహించనప్పటికీ, అనుమానం వెంటనే ఇజ్రాయెల్‌పై పడింది. దీనికి కారణం...హనియెతోపాటు పాలస్తీనా సాయుధ సమూహంలోని ఇతర నాయకులను చంపేస్తానని అక్టోబర్ 7 ప్రతిజ్ఞ చేసింది. అనంతరం ఇది గాజా యుద్ధానికి దారి తీసింది. ఇప్పటి వరకు జరిగిన ఈ యుద్దంలో 1,200 మంది ఇజ్రాయెల్‌లు మరణించారు. దాదాపు 250 మందిని బందీలుగా ఉన్నారు. 39,360 మంది పాలస్తీనియన్లు హతమయ్యారు.
ఇరాన్ ప్రకటనలో హనియే ఎలా హతమయ్యాడనే వివరాలు ఇంకా బయటకు రాలేదు. దాడిపై విచారణ సాగుతోందని గార్డ్ చెప్పారు.
ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో జరిగిన మసౌద్ పెజెష్కియాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హమాస్ అగ్రనేత హనియే హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా పాల్గొన్నారు.