Google offices Bed bug outbreak: సాఫ్వేర్లలో బగ్‌లు ఎక్కడ ఉన్నాయో వెదుక్కుంటూ ఉంటారు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు. కానీ బయట నుంచి వచ్చిన బగ్గులు కుట్టి పెడుతూంటే తట్టుకోలేకపోయారు. ఈ బగ్గులు నల్లలు.
టెక్ దిగ్గజం గూగుల్ న్యూయార్క్ ఆఫీసులో నల్లుల సమస్య పెరిగిపోయింది. ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బంది పడుతూండటంతో వర్క్ ఫ్రమ్ ఇచ్చేశారు. ఇతర గూగుల్ లొకేషన్లలో కూడా తనిఖీలు చేస్తున్నారు. టెక్ దిగ్గజం గూగుల్‌కు ఊహించని ట్విస్ట్.. న్యూయార్క్ సిటీలోని చెల్సీ క్యాంపస్‌లో బెడ్ బగ్ ఇన్ఫెక్షన్ సమస్య ఏర్పడింది. దీంతో ఉద్యోగులను తాత్కాలికంగా ఇంటి నుంచి పని చేయమని సూచించారు. నిపుణులు సమస్యను పరిష్కరిస్తున్నారు. అక్టోబర్ 19-20, 2025న గూగుల్ ఎన్విరాన్‌మెంటల్, హెల్త్ అండ్ సేఫ్టీ టీమ్ నుంచి ఇంటర్నల్ ఈమెయిల్ ద్వారా స్టాఫ్‌కు "క్రెడిబుల్ ఎవిడెన్స్" ఆఫ్ బెడ్ బగ్స్ గురించి తెలియజేశారు.
చెల్సీ ఆఫీస్ ఆదివారం మూసివేశారు. స్టాఫ్‌ను సోమవారం ఉదయం వరకు ప్రాథమిక పెస్ట్ కంట్రోల్ మెజర్స్ పూర్తయ్యే వరకు రావద్దని సూచించారు. కంపెనీ ఇతర న్యూయార్క్ సైట్లలో, ముఖ్యంగా హడ్సన్ స్క్వేర్ క్యాంపస్‌లో ముందస్తుగా బెడ్ బగ్స్ ఉన్నాయేమో పరిశఈలన ప్రారంభించింది. ఇది గూగుల్ మాన్‌హట్టన్‌లో బెడ్ బగ్స్‌తో సమస్య మొదటి సారి కాదు. 2010లో గూగుల్ 9వ అవెన్యూ ఆఫీసులలో ఇలాగే జరిగింది.
న్యూయార్క్ సిటీ ఈ నల్లులకు కేంద్రంగా మారిందని అంటున్నారు. బెడ్ బగ్స్ నిర్మూలన చాలెంజింగ్. లగేజ్, దుస్తులు, ఫర్నీచర్‌లలో దాక్కుంటాయి. అందుకే ఆఫీస్ మొత్తం క్లీన్ చేసే వరకు కొంత సమయం పడుతుందని అందరూ ఇళ్ల నుంచే పని చేయాలని సలహాలిస్తున్నారు.