ఫ్రాన్స్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అవసరానికి మించి ఉన్న మద్యంను ధ్వంసం చేయనుంది. క్రాఫ్టెడ్ బీర్ కు దేశవ్యాప్తంగా పెరిగిన డిమాండ్ తో మద్యం తయారీదారులు అవస్థలు పడుతున్నారు. బోర్డాక్స్, లాంగ్యూడాక్ కంపెనీలు...తయారు చేసిన మద్యం నిల్వలు భారీగా పెరిగిపోయాయ్. అదే సమయంలో వైన్ కు డిమాండ్ తగ్గిపోవడంతో...ధరలు పడిపోయాయ్. 
 
బోర్డాక్స్, లాంగ్యూడాక్ కంపెనీల నుంచి 17వందల కోట్లు పెట్టి ప్రభుత్వం వైన్ కొనుగోలు చేయనుంది. దేశంలో అదనంగా ఉన్న వైన్‌ను ధ్వంసం చేయాలని నిర్ణయించింది. వైన్‌కు మంచి ధర తీసుకొచ్చేందుకే...మద్యంను ధ్వంసం చేస్తున్నట్లు ప్రకటించింది. వైన్ ను ధ్వంసం చేసిన తర్వాత... అందులోని ఆల్కాహాల్‌ను వివిధ రకాల ఉత్పత్తులు తయారు చేయడానికి కంపెనీలకు విక్రయించనుంది. వైన్‌ తయారీ దారులు ఇతర మార్గాల్లో ఉపాధి వెతుక్కోడానికి నిధులను కేటాయించనుంది. 


రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం, ఆహారం, ఇంధన ధరలు పెరగడంతో...ప్రజలు ఖర్చులను తగ్గించుకుంటున్నారు. మద్యం కొనుగోలుకు ఆసక్తి చూపించడం లేదు. 2023 జూన్ వరకు ఐరోపా కమిషన్‌ గణాంకాల ప్రకారం... ఇటలీలో 7, స్పెయిన్‌లో 10, ఫ్రాన్స్‌లో 15, జర్మనీలో 22, పోర్చుగల్‌లో 34 శాతం వైన్‌ వినియోగం తగ్గిపోయింది.