Former Google Employee Includes Mia Khalifa Most Vodka Shots on CV gets 29 Interview Calls : మీ కరికులం విటే.. ఎంత బాగా ఉంటే అంత ఈజీగా ఉద్యోగం వచ్చేస్తుందని అనుకంటారు. మరి అలా ఎలా ఉండాలి అంటే.. అందరూ తలా ఒకటి చెబుతారు. అందుకే జెర్రీ అనే మాజీ గూగుల్ ఉద్యోగి ఒకరు సోషల్ ఎక్స్‌పరిమెంట్ చేశారు. తన సీవీలో విచిత్రమైన ప్లస్ పాయింట్స్ పెట్టారు. అందులో ఒకటి మియా ఖలిఫా ఎక్స్ పర్ట్ అంట. మియా ఖలీఫా పేరు పొందిన అడల్ట్ సినిమాల హీరోయిన్. బహుశా ఆమె వీడియోలు చూడటంలో తాను ఎక్స్ పర్ట్‌నని ఆయన చెబుతున్నారని అర్థం చేసుకోవచ్చు. అలాగే.. ఒక రాత్రిలో అత్యధిక వోడ్కా షాట్స్ తీసుకోవడం కూడా తన ప్లస్ పాయింట్ అని సీవీలో రాసుకొచ్చారు.
సిక్ లీవులు పెడితే ఇంటికి మేనేజర్లు - టెస్లా ఉద్యోగులను రాచి రంపాన పెడుతున్న ఎలన్ మస్క్
రాసుకుంటే పెద్ద విశేషం ఏమీ ఉండదు. దాన్ని ఆయన ఉద్యోగం ఇవ్వండి మహా ప్రభో అని కంపెనీలకూ పంపించారు. చాలా కంపెనీలుక ఆయన పంపించారు. ఆ సీవీ చూస్తే " ఎవడ్రా వీడు తేడాగా ఉన్నాడే"నని ఎవరైనా అనుకుంటారు. అక్కడే సోషల్ ఎక్స్‌పరిమెంటే్ చేశానని ఈ జెర్రీ చెబుతున్నారు. ఈ ఎక్స్‌పరిమెంట్‌లో అతను ఏం సాధించాడంటే.. ఏకంగా ఇరవై తొమ్మిది ఇంటర్యూ కాల్స్. కాస్త అతిశయోక్తిగా ఉన్నా ఇది నిజమని.. తన సీవీ చూసిన తర్వాత కూడా తనకు 29 ఇంటర్యూ కాల్స్ వచ్చాయని జెర్రీ ప్రకటించారు. ఇందులో బడా కంపెనీలు కూడా ఉన్నాయని చెబుతున్నారు.
జెర్రీ మూడేళ్ల పాటు గూగుల్ లో పని చేశాడు. స్ట్రాటజీ అండ్ ఆపరేషన్స్ మేనేజర్ గా చేశాడు. దీన్నికూడా చెప్పారు. మొత్తంగా తనకు ఇరవై తొమ్మిది కాల్స్ రావడంతో ఆశ్చర్యపోయారు. ఆరు వారాల పాటు ఆయనకు వరుసగా ఇంటర్యూ కాల్స్ వస్తూనే ఉన్నయి. ఓ ఇన్ స్టా వీడియోలో తన అనభవాన్ని.. తాను చేసిన సోషల్ ఎక్స్ పరిమెంట్ ను వివరించారు.
టప్పర్‌వేర్ కంపెనీ ఎందుకు దివాలా తీసింది ? నోకియాలాగే మార్పును అందుకోలేకపోయిదా?
గూగల్ అనే పెద్ద కంపెనీలో తాను పని చేసినందున అదే ఇతర కంపెనీలను ఆకర్షించిందని జెర్రీ తెలిపాడు. పెద్ద అక్షరాలతో రాయడం వల్ల అటెన్షన్ సాధించవచ్చు కానీ.. ఇలాంటి గూగుల్ వంటి బిగ్ నేమ్స్ ఎఫెక్ట్ వేరుగా ఉంటుందన్నారు.