Former British PM Rishi Sunak joins Microsoft: రిషి సునాక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బ్రిటన్ ప్రధానిగా ఇన్‌ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి అల్లుడిగా  మన దేశంలో బాగానే ఫేమస్ అయ్యారు. అయితే ఆయన ఇప్పుడు మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగంలో చేరి అందర్నీ ఆశ్చర్యపరిచారు.  యునైటెడ్ కింగ్‌డమ్ మాజీ ప్రధానమంత్రి రిషి సునాక్, అమెరికా టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ,  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ ఆంత్రోపిక్‌లో సీనియర్ అడ్వైజర్ ,  స్ట్రాటజిక్ కన్సల్టెంట్‌గా చేరారు. 2022 నుంచి 2024 వరకు యూకే ప్రధానమంత్రిగా పనిచేసిన సునాక్  టెక్నాలజీ రంగంలోకి తిరిగి అడుగుపెడుతున్నారు. ఈ నియామకాలకు యూకే   అడ్వైజరీ కమిటీ ఆన్ బిజినెస్ అపాయింట్‌మెంట్స్ (ACOBA) ఆమోదం లభించింది. అయితే, రెండేళ్ల పాటు సునాక్ యూకే ప్రభుత్వ మంత్రులను లాబీ చేయడం లేదా ఈ కంపెనీలకు యూకే ప్రభుత్వ కాంట్రాక్ట్‌లు సంపాదించడంలో సహాయం  చేయకూడదని షరతు పెట్టింది.  

Continues below advertisement

రిషి సునాక్ మైక్రోసాఫ్ట్ , ఆంత్రోపిక్‌లో సీనియర్ అడ్వైజర్‌గా వ్యవహరిస్తూ, స్ట్రాటజిక్ కన్సల్టెంట్‌గా కంపెనీలకు మార్గదర్శనం అందిస్తారు. ఈ పాత్రల్లో ఆయన యూకే ప్రభుత్వంతో లాబీయింగ్ చేయడం లేదా కాంట్రాక్ట్‌ల సంపాదనలో పాల్గొనకూడదు.   ఈ నిబంధనలు ACOBA ఆమోదంలో భాగంగా రెండేళ్ల వ్యవధికి వర్తిస్తాయి. సునాక్ తన ప్రధానమంత్రి పదవి సమయంలో టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాలను ప్రోత్సహించారు.   ప్రస్తుతం ఆయన బ్రిటిష్ పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగుతున్నారు. గతంలో గోల్డ్‌మన్ సాచ్స్‌లో పనిచేసిన అనుభవం ఉన్న సునాక్, ఇటీవల మళ్లీ ఆ సంస్థలో సీనియర్ రోల్ తీసుకున్నారు. ఇప్పుడు మైక్రోసాఫ్ట్, ఆంత్రోపిక్‌లో చేరడం ద్వారా కార్పొరేట్ ప్రపంచంలో ఆయన పాత్ర మరింత బలపడింది.  

 మైక్రోసాఫ్ట్‌లో సునాక్ సీనియర్ అడ్వైజర్‌గా, కంపెనీ  గ్లోబల్ స్ట్రాటజీ, పాలసీలపై సలహాలు ఇస్తారు. ఆంత్రోపిక్, ఒక ఏఐ స్టార్టప్, ఏఐ రిసెర్చ్, డెవలప్‌మెంట్‌లో వేగవంతమైన పురోగతిని సాధిస్తోంది. ఇక్కడ సునాక్ స్ట్రాటజిక్ కన్సల్టెంట్‌గా, ఏఐ టెక్నాలజీ యొక్క ఎథికల్, రెగ్యులేటరీ అంశాలపై సలహాలు అందిస్తారని భావిస్తున్నారు. ఆంత్రోపిక్, గతంలో ఓపెన్‌ఏఐకి పోటీగా ప్రారంభించిన సంస్థ.  

సునాక్ ఇన్‌ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి అల్లుడు కూడా. అయన కావాలనుకుంటే ఇన్ ఫోసిస్ లో నే ఆ బాధ్యతలు, ఉద్యోగం నిర్వర్తించవచ్చు. కానీ ఆయన మైక్రోసాఫ్ట్ ను ఎంచుకున్నారు.