Five Planets Alignment: ఈరోజు రాత్రికి ఆకాశంలో అద్భుతం కనిపించనుంది. ఒకేసారి ఐదు గ్రహాలను చూసే అవకాశం. ఎస్ ఈ రోజు పంచగ్రహ కూటమి. మెర్క్యూరీ, వీనస్, మార్స్, జ్యూపిటర్, యురేనస్..ఒకే లైన్ లో ఉన్నట్లు..ప్లానెట్ పరేడ్ ను చూసే అవకాశం ఈ రోజే. మార్చి 28 రాత్రి ఆకాశం వేదికగా జరిగే ఈ అద్భుతాన్ని వీక్షించేందుకు ప్రపంచవ్యాప్తంగా సైన్స్ ప్రేమికులు, ఖగోళ శాస్త్రవేత్తలు ఉత్సాహం చూపిస్తున్నారు. ఎక్స్ ట్రీమ్ లీ రేర్ ఆస్ట్రానమిక్ ఈవెంట్ గా చెప్పుకునే ఈ పంచగ్రహ కూటమి..పేరుకే దగ్గరగా ఉన్నట్లు కనిపించినా...అసలు అవి దగ్గర్లోనే ఉండవు. మరి ఇలా ఎలా లైన్ లో కనిపిస్తాయంటే చెప్పుకుందాం.


సూర్యుడి చుట్టూ మన సూర్యకుటుంబంలోని గ్రహాలు ఇలా తిరుగుతూ ఉఁటాయని తెలుసు కదా. ఇలా తిరుగుతూ సూర్యుడికి దగ్గరగా ఈ గ్రహాలు వస్తున్నట్లు భూమి పై నుంచి చూసేవాళ్లకు ఇవే ఒకే సరళ రేఖలో ఉన్నాయా ఇల్యూజన్ కలుగుతుంది అంతే. అందుకే ఇలా లైన్ లో ఉన్నట్లు ఓ కూటమిలా ఏర్పడినట్లు కనిపిస్తాయి. ఈ సారి ఈ పంచ గ్రహ కూటమి చాలా ప్రత్యేకం ఎందుకంటే..మిగిలిన నాలుగు గ్రహాలతో పోలిస్తే ఈ యురేనస్ భూమి పైనుంచి కనిపించటం అరుదైన విషయం. ఎందుకంటే ఇది ఒక సూర్యుడి చుట్టూ తన భ్రమణాన్ని కంప్లీట్ చేయటానికి 84 సంవత్సరాలు పడుతుంది కాబట్టి..ఇలా ఓ అలైన్ మెంట్ కుదరాలంటే మళ్లో 84 సంవత్సరాలు వెయిట్ చేయాలి అది కూడా మిగిలిన వాటి భ్రమణాల టైమ్ తో మ్యాచ్ కావాల్సి ఉంటుంది. సో ఇదొక రేర్ ఈవెంట్


మాములు కళ్లతో ఈ ఐదు గ్రహాల కూటమి ని చూడొచ్చు. సూర్యస్తమయం తర్వాత నుంచి కనిపిస్తాయి. ఆకాశం నిర్మలంగా ఉంటే చాలు. పడమటి వైపు చూస్తే ఈ ఐదు చిన్నపాటి చుక్కల్లా కనిపిస్తాయి. వీనస్ బాగా బ్రైట్ గా కనిపిస్తుంది. యురేనస్ మాత్రం మాములు కంటికి కనపడకపోవచ్చు ఏమో..బైనాక్యులర్స్ తో చూడొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. టెలిస్కోప్ ఉంటే మాత్రం ఉంటే పంచగ్రహ కూటమి తనివితీరా చూడొచ్చు. మీకు దగ్గర్లో ఉన్న సైన్స్ సెంటర్స్, అబ్జర్వేటరీలు, ప్లానోటోరియమ్స్ లో కూడా టెలిస్కోప్ తో చూడగలిగే అవకాశాన్ని అందుబాటులో ఉంచుతారు. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. చూసిన తర్వాత మీ ఫీలింగ్స్ ఏంటో మాతో షేర్ చేసుకోండి.