Elon Musk in wartime mode: టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ పూర్తిగా రాజకీయాలకు గుడ్ బై చెప్పాడు. పూర్తి సమయంలో వ్యాపారాలకే సమయం కేటాయించాలని నిర్ణయించుకున్నారు. పూర్తి సమయం 24/7 .. కుటుంబానికి కూడా సమయం కేటాయించకుండా.. ఇక వ్యాపారాలపై దృష్టి పెట్టి ఆఫీసులోనే తిండి, నిద్ర కూడా పూర్తి చేయాలని డిసైడయ్యారు. గతంలో ఆయన ఇలాగే పని చేసేవారు. ఎలాంటి లగ్జరీలను కోరుకునేవారు కాదు. కానీ తర్వాత ట్రంప్ విజయం కోసం వ్యాపారానికి సమయం తగ్గించారు. 

టెస్లా, స్పేస్‌ఎక్స్, ఎక్స్  ,  AI  ప్రాజెక్టులు వంటి అతని  సంస్థలలో పెరుగుతున్న ఒత్తిడుల కారణంగానే నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని చెబుతూ  టెస్లా ఆర్థిక సంక్షోభ సమయంలో “వార్‌టైమ్ సీఈఓ”గా తన అనుభవాలను ప్రతిబింబిస్తూ ఒక పాత వీడియోను ఎక్స్‌లో రీపోస్ట్ చేశాడు.  ఎవరూ ఇంత ఎక్కువ గంటలు పని చేయకూడదు. ఇది మంచిది కాదు. ఇది చాలా బాధాకరం” అని గతంలో ఆయన అన్న మాటల వీడియోను తాన రీపోస్టు చేసుకున్నారు. 

మస్క్ ప్రస్తుతం టెస్లా , స్పేస్‌ఎక్స్ , ఎక్స్  , xAI, ది బోరింగ్ కంపెనీ  వంటి  సంస్థలను నిర్వహిస్తున్నాడు. ఈ సంస్థలలో ఒక్కొక్కటి ప్రస్తుతం కీలకమైన అభివృద్ధి దశలో ఉన్నాయి.  ఈ ఏడాది టెస్లా షేర్లు సుమారు 18 శాతం పడిపోయాయి, యూరప్‌లో అమ్మకాలు 49 శాతం  తగ్గాయి. మస్క్ రాజకీయ నిర్ణయాల కారణంగా ఎక్కువగా నష్టం జరిగింది.  స్టార్‌షిప్ రాకెట్ టెస్ట్ లాంచ్‌లు, స్టార్‌లింక్ సాటిలైట్ ఇంటర్నెట్ సేవల విస్తరణ వంటి ప్రాజెక్టులపై స్పేస్ ఎక్స్ ఎక్కువగా పెట్టుబడి పెడుతోంది. 

ట్విట్టర్‌ను 2022లో కొనుగోలు చేసిన తర్వాత, మస్క్ దానిని ఎక్స్‌గా రీబ్రాండ్ చేశాడు, కానీ దాని విలువ 70 శాతం తగ్గిందని అంచనా వేస్తున్నారు.  కృత్రిమ మేధస్సు అభివృద్ధిలో గ్రోక్ చాట్‌బాట్‌ను అభివృద్ధి చేస్తోంది, ఇది ఇటీవల వివాదాస్పదమైన సమాధానాల కారణంగా విమర్శలను ఎదుర్కొంది.  వార్‌టైమ్ సీఈఓ మోడ్ గా తనను తాను మస్క్ అభివర్ణించుకుంటున్నారు.  తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేస్తూ, కార్యాలయంలోనే గడుపుతున్నారు.  2018లో  టెస్లా మోడల్ 3 ఉత్పత్తి సమస్యల సమయంలో, మస్క్ వారానికి 120 గంటలు పని చేసి  ఫ్యాక్టరీలోనే నిద్రపోయేవాడు.  ఇది జీవన్మరణ సమస్య. మేము వారానికి  0 మిలియన్ డాలర్లు, కొన్నిసార్లు 100 మిలియన్ డాలర్లు కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తంచేశాడు. 

ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన తర్వాత, మస్క్ ఉద్యోగులను  ఎక్కువ గంటలు  పని చేయాలని ఆదేశించాడు. శాన్ ఫ్రాన్సిస్కో కార్యాలయంలో కొన్ని భాగాలను తాత్కాలిక నిద్ర గదులుగా మార్చడం వల్ల “ట్విట్టర్ హోటల్” అని పిలిచారు. 2022లో, మస్క్ టెస్లా ఫ్రీమాంట్ ,  నెవాడా ఫ్యాక్టరీలలో మూడు సంవత్సరాలు గడిపినట్లు చెప్పాడు, కొన్నిసార్లు డెస్క్ కింద లేదా టెంట్‌లో నిద్రించానని కూడా చెప్పుకున్నారు.  మస్క్   ప్రకటన తర్వాత, టెస్లా షేర్లు సుమారు 7 శాతం పెరిగాయి. 

రాజకీయ జోక్యాల వల్ల తన వ్యాపార సంస్థల్లో ఏర్పడిన సంక్షోభాన్ని పరిష్కరించుకునేందుకు పూర్తిగా ట్రంప్ మళ్లీ సీఈవో అవతారం ఎత్తుతున్నారు.