China Earthquake: బీజింగ్ భూకంప ఏజెన్సీ ప్రకారం, చైనా దక్షిణ-పశ్చిమ యున్నాన్ ప్రాంతంలో భూకంపం సంభవించింది. సిన్హువా వార్తా సంస్థ ప్రకారం, చైనా భూకంప నెట్‌వర్క్ సెంటర్ 7.9 తీవ్రతతో భూకంపం సంభవించిందని తెలిపింది. సీఈఎన్‌సీ తరపున సోషల్ మీడియా పోస్ట్‌లో యున్నాన్‌లో భూకంపం సంభవించిందని పేర్కొంది.
చైనాలో భూకంపం ముందు మయన్మార్‌లోనూ 7.7 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది. దీని ప్రభావం దక్షిణ థాయిలాండ్ వరకు ఉంది. ఆ దేశ రాజధాని బ్యాంకాక్‌లో విధ్వంసం జరిగింది. భూమి కంపించడంతో ప్రజలు రోడ్లపై పరుగులు తీశారు. యుఎస్‌జిఎస్ ప్రకారం, మయన్మార్‌లోని సాగాయింగ్ నగరం నుంచి 16 కిలోమీటర్లు (10 మైళ్లు) ఉత్తర-పశ్చిమంగా భూకంపం సంభవించింది.
బ్యాంకాక్‌లో నిర్మాణంలో ఉన్న భవనం కూలిపోయిందిజిన్హువా వార్తా సంస్థ ప్రకారం, బ్యాంకాక్‌లో నిర్మాణంలో ఉన్న 30 అంతస్తుల భవనం కూలిపోవడంతో, చాలా మంది లోపల చిక్కుకున్నారని భయపడుతున్నారు. అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నాయి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. చైనా CCTV ప్రకారం, యునాన్ సరిహద్దు ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు సంభవించాయని నివేదికలు వచ్చాయి. గుయిజౌ , గ్వాంగ్జీ ప్రాంతాలలో కూడా ప్రకంపనలు సంభవించాయి, దీనితో ఈ ప్రాంతంలోని ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.
మయన్మార్‌లోని చైనా రాయబార కార్యాలయం ప్రకటనమయన్మార్‌లోని చైనా రాయబార కార్యాలయం పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపింది. ప్రస్తుతం అక్కడి నుంచి ఎటువంటి పెద్ద ప్రమాదం జరిగినట్లు వార్తలు లేవు. మయన్మార్ డేంజర్ జోన్‌లో ఉంది. ఈ భూకంపం అక్కడి పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసింది. యాంగోన్‌లో పనిచేస్తున్న చైనా వ్యాపారవేత్త వు యుటాంగ్ మాట్లాడుతూ... భూకంపం వచ్చినప్‌పుడు తాను తన కార్యాలయంలో ఉన్నానని చెప్పాడు. "డెస్క్‌లు షేక్ అయ్యాయని, తాను కూడా ఆ ప్రకంపనల ప్రభావానికి గురైనట్టు చెప్పారు. వెంటనే తనతోపాటు కార్యాలయంలో ఉన్న దాదాపు 15 మంది బయటకు పరుగులు తీశామన్నారు
థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ భవనాలు కూలిపోయిన వీడియోలు బయటకు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఈ విధ్వంసక భూకంపం చిత్రాలు హృదయ విదారకంగా కనిపిస్తున్నాయి. ఎక్కడో ప్రజలు భయంతో పారిపోతున్నట్లు కనిపిస్తుంటే, ఎక్కడో భవనాలు కూలిపోతున్నాయి. భూకంపం తరువాత వీడియోలు వైరల్ అవుతున్నాయి. ప్రతిచోటా శిథిలాల చిత్రాలు కనిపిస్తున్నాయి.
ఈ శక్తివంతమైన భూకంపంలో వందలాది మంది మరణించే అవకాశం ఉంది. రక్షణ, సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి.ఇంతలో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సోషల్ మీడియా వినియోగదారులు ఈ భూకంపంపై స్పందిస్తున్నారు. ఈ వ్యక్తులు భూకంప బాధితుల సంక్షేమం కోసం ప్రార్థిస్తున్నారు. భారతీయ వినియోగదారులు కూడా ఈ భూకంపం చిత్రాలను పంచుకుంటూ ప్రాణనష్టం లేకుండా చూడు దేవుడా అని వేడుకుంటున్నారు.