BR Shetty Story: 12 వేల కోట్ల వ్యాపారాన్ని 74 రూపాయలకు అమ్మేశాడు - నమ్మలేరా - బీఆర్ షెట్టి కథ మీరే చదవండి!

Viral News: బీఆర్ షెట్టి గల్ఫ్ లో ఎంత విజయవంతమైన వ్యాపారవేత్తో అందరికీ తెలుసు.కానీ ఇప్పుడు ఆయన దివాలా తీశారన్న విషయం చాలా మందికి తెలియదు.

Continues below advertisement

BR Shetty Bankrupted : కేరళలో జన్మించి యూఏఈకు వెళ్లి అక్కడ అతిపెద్ద వ్యాపార సామ్రాజాన్ని స్థాపించిన బీఆర్ షెట్టి  గురించి ఎంతో స్ఫూర్తిదాయకంగా గతంలో చదువుకుని కానీ ఆయన కొన్ని తప్పుల వల్ల తన రూ.12వేల కోట్ల రూపాయల వ్యాపారాన్ని  కేవలం 74 అంటే 74 రూపాయలకు అమ్ముకుని దివాలా తీశారు. దానికి కారణం ఒక్క ట్వీట్ మాత్రమే. బీఆర్ షెట్టి కంపెనీలు ఆర్థిక అవకతవలకు పాల్పడుతున్నాయని ఓ సంస్థ చేసిన ట్వీట్ తో మొత్తం జాతకం తలకిందులు అయిపోయింది. 

Continues below advertisement

వైద్య రంగంలో అద్భుతాలు చేసిన బీఆర్ షెట్టి          

సౌదీ అరేబియాలోని న్యూమిరా గ్రూప్  స్థాపకుడు బీఆర్ షెట్టి.  ఆరోగ్య సేవలు, ఆర్థిక సేవలు, టెక్నాలజీ , ఆహారం వంటి అనేక రంగాలలో వ్యాపారాలు ప్రారంభఇంచారు.  సౌదీ అరేబియాలో ఆరోగ్య సేవల పరిశ్రమలో చేసిన విప్లవాత్మక మార్పులు ప్రపంచం దృష్టిని ఆకరషించాయి. ఎన్‌ఎంసీ గ్రూపు పేరుతో ఆయన చేసిన వ్యాపారాలు యుఎఇలో అగ్రగామి ప్రైవేట్ హెల్త్‌కేర్ ప్రొవైడర్‌గా ఎదగడంలో కీలకమైన పాత్ర పోషించాయి.   ఎన్‌ఎంసి హెల్త్, యుఎఇ ఎక్స్ఛేంజ్ , ఫైనాబ్లర్ వంటి సంస్థలతో విభిన్న వ్యాపార రంగాల్లో ప్రవేశించారు.  2019లో ఫోర్బ్స్ అంచనా వేసిన నికర విలువ సుమారు 3.5 బిలియన్ డాలర్లు.      

2019లో  గల్ఫ్ లో టాప్ కుబేరుల్లో ఒకరు - ఇప్పుడు దివాలా 

ఆయనది విలాసవంతమైన జీవన శైలి. దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా , పామ్ జుమైరాలో  లగ్జరీ ఇళ్లు ఉన్నాయి. ఒక ప్రైవేట్ జెట్  , రోల్స్ రాయిస్, మేబ్యాక్ వంటి ఖరీదైన వాహనాలు ఉండేవి. అయితే NMC హెల్త్ ఆర్థికంగా తప్పుడు పద్దతులు పాటిస్తోందని  ఆరోపిస్తూ మడ్డీ వాటర్స్ రీసెర్చ్  ఓ ట్వీట్ చేయడం బీఆర్ షెట్టి జాతకాన్ని మార్చేసింది. ఆ ట్వీట్ కంపెనీ స్టాక్ విలువను భారీగా తగ్గిచింది.  కంపెనీ నుంచి రాజీనామా చేయాల్సి వచ్చింది.  చివరికి రూ. 74 కు రూ. 12,478 కోట్ల విలువైన తన కంపెనీతో విడిపోవాల్సి వచ్చింది. ఆర్థికపరమైన అవకతవకల కారణంగా ఆయన ఎన్నో కేసులను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది.              

ఒక్క ట్వీట్ వల్లే ఇదంతా ! 
  
అబుదాబి కమర్షియల్ బ్యాంక్  షెట్టిపై దావే వేసింది.  భారత అధికారుల దర్యాప్తుతో సహా చట్టపరమైన సమస్యలను ఆయన ఎదుర్కొన్నారు. అతని ఖాతాలను UAE సెంట్రల్ బ్యాంక్ స్వాధీనం చేసుకుంది. చిన్న స్థాయిలో ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లి అక్కడ వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించిన బీఆర్ షెట్టి అదే జీవితంలో పతనాన్ని చూశారు. ఇప్పుడు ఆయన దివాలా తీశారు. సర్వం కోల్పోయారు.  ఒక్క ట్వీట్ వల్లనే ఇదంతా జరిగిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. 

బీఆర్ షెట్టి తన కంపెనీల ఆర్థిక విషయాల్లో కొన్ని పొరపాట్లు చేసి ఉండవచ్చు కానీ  వ్యాపారంగంలో  ఆయన విజయాలు మాత్రం ఎంత మందికో స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. ఇలాంటి వారు చిన్న చిన్న తప్పులతో సర్వం  పోగొట్టుకోవడం చాలా మందిని బాధిస్తోంది. 

Continues below advertisement