Donkey Crashes Into Pakistani Assembly Hall Mid Session :  పాకిస్తాన్ పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్షసభ్యులు తిట్టుకుంటూ ఉంటారు. గాడిద అని కూడా అరుపులు కేసులు వినిపిస్తూ ఉంటాయి. కానీ ఈ సారి మాత్రం నిజంగానే ఓ గాడిద పార్లమెంట్ లోకి వచ్చేసింది. 

Continues below advertisement

పాకిస్తాన్ పార్లమెంట్ సెనెట్  జరుగుతున్న సమయంలో  ఒక గాడిద ఆకస్మికంగా  లోపలికి వచ్చేసింది.  శుక్రవారం జరిగిన ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  సభ్యులు ఆశ్చర్యపోయినా గట్టిగా నవ్వుకున్నారు.  సెక్యూరిటీ సిబ్బంది గాడిదను బయటకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే, అది  భయంతో కొందరి ఎంపీలపై దాడి చేసింది.     

Continues below advertisement

మొదట గాడిద వచ్చినప్పుడు  సెక్యూరిటీ సిబ్బంది  దాన్ని బయటకు తీసుకెళ్లారు. కానీ, కొన్ని నిమిషాల తర్వాత అది మళ్లీ తిరిగి సభలోకి పరిగెత్తి, కొందరు ఎంపీలను డీకొట్టింది.  సెనెట్ చైర్మన్ యూసఫ్ రజా గిలానీ ఈ ఘటనపై హాస్యంగా స్పందిస్తూ గాడిదలు కూడా  వాయిస్ ఉండాలని కోరుకుంటున్నాయని సెటైర్ వేసుకున్నారు.  

పార్లమెంట్ హౌస్ సర్వీస్ కారిడార్ భద్రత లోపంతో దగ్గరలో ఉన్న స్టేబుల్స్ నుంచి గాడిద లోపలికి చొరబడిందని గుర్తించారు. ఈ ఘటన పాకిస్తాన్ పార్లమెంట్ పై నెటిజన్లు జోకులు వేయడానికి బాగా ఉపయోగపడుతోంది.