Donald Trump : అమెరికా అధ్యక్షుడి ప్రమాణ స్వీకారమే ప్రత్యేకం - కీలక దేశాల్లో నేతల ప్రమాణ స్వీకారం ఎలా ఉంటుందో తెలుసా ?
Donald Trump Oath Event: అమెరికా దేశ అధ్యక్షుడు అంటే ఆషామాషీ కాదు. ఆయన ప్రమాణ స్వీకారం కూడా అంతే వైభవంగా జరుగుతోంది. అదే స్థాయిలో ఇతర దేశాల అధ్యక్షుల ప్రమాణాలు కూడా జరుగుతాయి.

Donald Trump Oath Event : ప్రపంచ పెద్దన్న అమెరికా అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం ఓ రేంజ్ లో జరుగుతుంది. మొదట సంగీత ప్రదర్శనలు, ఈవెంట్ బ్యాండ్ పేరేడ్స్ సహా కొన్ని అధికారిక సమావేశాలు ఉంటాయి.
ప్రమాణం చేయించేది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
వాషింగ్టన్ నగరంలో సరిగ్గా 12 గంటలకు ప్రమాణస్వీకార కార్యక్రమం మొదలవుతుంది. అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణస్వీకారం చేయిస్తారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు టిక్కెట్లు కొనుక్కోవచ్చు. ఇలా దాదాపు 2,20,000 టిక్కెట్లు అమ్ముడయ్యాయి. కానీ ఈవెంట్ ను అత్యధిక చలి వాతావరణం కారణంగా ఇండోర్ కు మార్చారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో భాగంగా క్యారీ అండర్‌వుడ్ మ్యూజిక్ కాన్సెర్ట్ నిర్వహించనున్నారు. కాన్సెర్ట్ తర్వాత, వైట్ హౌస్ పెన్సిల్వేనియా అవెన్యూ వైపు పరేడ్ ఉంటుంది.ఈ పరేడ్ టీమ్ లో ఆర్మీ సైనికులు పాల్గొంటారు. ట్రంప్ ఇంకా అతని అతిథులు వైట్ హౌస్ సమీపంలోని ప్రత్యేక వేదిక నుండి పరేడ్ వీక్షిస్తారు. మాజీ అధ్యక్షులలో బిల్ క్లింటన్, జార్జ్ డబ్ల్యూ బుష్, బరాక్ ఒబామా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతారు. మాజీ ప్రథమ మహిళలు లారా బుష్, హిల్లరీ క్లింటన్ కూడా రానున్నారు.
భారత్‌లో నిరాడంబరంగా ప్రమాణ స్వీకారం
భారత్‌లో ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రమాణ స్వీకారం ఘనంగా జరుగుతుంది. రాష్ట్రపతి భవన్ బయట విశాలమైన ప్రదేశంలో ఎక్కువగా ప్రమాణం జరుగతుంది. అమెరికాలో ఉన్నట్లుగా పరేడ్లు ఉండవు. రాష్ట్రపతి ప్రదానితో పాటు మంత్రివర్గంతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. రాజకీయంగా కొన్ని కార్యక్రమాలు జరుగుతాయి. ప్రమాణ స్వీకారం తర్వాత విందు ఉంటుంది కానీ అంతకు మించి కార్యక్రమాలు నిర్వహించరు.
చైనా, రష్యాల్లో అరుదుగా ప్రమాణ వేడుకలు
ప్రపంచ అగ్రదేశాల్లో రెండుగా ఉన్న చైనా, రష్యాల్లో భిన్నమైన వేడకులు ఉంటాయి. చైనా పూర్తిగా కమ్యూనిస్టు దేశం. ప్రజాస్వామ్య దేశం కాదు. ప్రజలు అక్కడి ప్రభుత్వాన్ని లేదా అధ్యక్షుడిని ఎన్నుకోరు. కమ్యూనిస్టు పార్టీకి అధ్యక్షుడే దేశానికి అధ్యక్షుడు. గతంలో కొన్ని రూల్స్ ఉండేవి కానీ.. జిన్ పింగ్ అన్నీ మార్చేసుకుని శాశ్వత అధ్యక్షుడిగా ఉండేలా ఏర్పాట్లు చేసుకున్నారు. గతంలో అయితే చైనా అధ్యక్షుడు బాధ్యతలు తీసుకునే ఘట్టాలు బలప్రదర్శనతో ఉండేవి. అయితే అక్కడి ప్రభుత్వ మీడియా విడుదల చేసే దృశ్యాలు మాత్రమే వెలుగులోకి వస్తాయి. మరో వైపు రష్యాలో ప్రజాస్వమ్యమే ఉంది కానీ.. అది ఒక్క పుతిన్ తప్ప ఎవరూ గెలవని ప్రజాస్వామ్యం. ఆయన కూడా పదవి బాధ్యతలు చేపట్టి ఏళ్లు దాటిపోయింది. ప్రమాణ స్వీకారం సందర్భంగా ఎలాంటి హడావుడి చేయరు.
జపాన్, సహా ఇతర ముఖ్య నేతల్లో నిరాడంబరంగా ప్రమాణ స్వీకారాలు
ప్రపంచ అగ్రదేశాలన్నింటిలోనూ అధ్యక్షులు ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికవుతూంటారు. వారి ప్రమాణ స్వీకారాలు ధూం..ధాంగా జరుగుతూంటాయి. కొన్ని దేశాల్లో సాంస్కృతి క కార్యక్రమాలో హోరెత్తిస్తారు. అయితే చాలా దేశాల్లో సింపుల్ గా ప్రమాణం చేసేస్తారు. జర్మనీ, జపాన్ వంటి దేశాల్లో ఆడంబరాలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వరు. వీటిని బట్టి చూస్తే.. అమెరికా అధ్యక్షుడి ప్రమాణ స్వీకారమే ప్రపంచంలో చాలు సుదీర్ఘంగా..మ్యూజికల్ ఫెస్టివల్, పరేడ్స్‌తో సాగుతుందని అనుకోవచ్చు.