Donald Trump Assassination Attempt:గత నెలలో టర్కీ రాజధాని అంకారాలో జరిగిన నాటో శిఖరాగ్ర సమావేశంలో ప్రపంచ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశానికి హాజరైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకొని ఇరాన్ ప్రాక్సీ దళాలు ఒక భారీ హత్యా ప్రయత్నానికి స్కెచ్ వేశాయి. సాధారణంగా అమెరికా అధ్యక్షుడి పర్యటనను అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య జరుగుతాయి. అయితే ఈసారి ఎదురైన ముప్పు ఊహించని విధంగా ఉండటంతో, సీక్రెట్‌ సర్వీస్‌, నిా సంస్థలు ఒక అసాధారణమైన నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చింది. 

Continues below advertisement

ఆపరేషన్ క్యాటరింగ్ కంటైనర్‌

ట్రంప్ పర్యటన ముగించుకొని తిరిగి వెళ్లే సమయంలో హైడ్రామా సాగింది. ఆయన సాధారణంగా ప్రయాణించే భారీ బోయింగ్ 747-8 ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌ విమానం రన్‌వేపై సిద్దంగా ఉంది. కానీ ఇరాన్ అనుకూల శక్తుల నుంచి ముప్పు పొంచి ఉందన్న పక్కా సమాచారంతో చివరి నిమిషంలో నిఘా వర్గాలు వ్యూహాన్ని మార్చాయి. వాషింగ్టన్ పోస్టు నివేదిక ప్రకారం ట్రంప్‌ను రహస్యంగా ఎయిర్‌ ఫోర్స్ వన్ నుంచి ఒక చిన్న సీ-32ఏ జెట్‌లోకి తరలించారు. ఆ తరలింపు ప్రక్రియ ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు ట్రంప్‌ను ఒక క్యాటరింగ్ కంటైనర్‌లో దాచి ఉంచి విమానం మార్చారు. ఒక దేశాధ్యక్షుడు ఇలాంటి పద్ధతిలో ప్రాణాలు కాపాడుకోవడం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. 

సమయం- ప్రదేశం 

ఈ ఘటన గత నెలలో అంకారా అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగింది. జులై 8వ తేదీన నాటో సదస్సు ముగిసిన తర్వాత, ట్రంప్‌ బ్రిటన్ బయల్దేరాల్సిన ఉంది. ఆ సమయంలో ఎయిర్‌ ఫోర్స్ వన్ దగ్గర పార్క్ చేసిన క్యాటరింగ్ ట్రక్కుల ద్వారా ప్రక్రియను పూర్తి చేశారు. వీడియో ఫుటేజీల ప్రకారం, ఎయిర్‌ ఫోర్స్ వన్‌ నుంచి కిందకు దిగిన క్యాటరింగ్ ట్రక్, వెంటనే పక్కనే ఉన్న చిన్న సీ -32ఏ విమానం వద్దకు వెళ్లడం గమనించవచ్చు. 

ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? 

ఈ ఆపరేషన్‌కు ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఇరాన్ మద్దతు ఉన్న శక్తులు ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకున్నట్టు అమెరికా ఇంటెలిజెన్స్‌ వర్గాలకు సమాచారం అందించింది. విమానం టేకాఫ్‌ సమయంలో లేదా గాలిలో ఉన్నప్పుడు దాడి చేసే అవకాశం ఉందని భావించారు. ఖతార్ రాజకుటుంబం బహుమతిగా ఇచ్చిన అత్యాధునిక బోయింగ్ 747-8 విమానంపై గత కొంతకాలంగా భద్రతాపరమైన విమర్శలు వస్తున్నాయి. ఇందులో మిస్సైల్‌ డిఫెన్స్ సిస్టమ్స్‌ పాత ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ తరహాలో లంగా లేవనే అనుమానాలు ఉన్నాయి. ఈ కారణంతోనే పాత, నమ్మకమైన చిన్న విమానంలోకి అధ్యక్షుడిని మార్చాలని నిర్ణయించారు. 

రహస్యంగా జరిగిన విమానాల మార్పిడి

ఈ ఆపరేషన్ ఎంత రహస్యంగా జరిగిందంటే, అధ్యక్షుడితోపాటు ప్రయాణించే జర్నలిస్టులకు కూడా అసలు విషయం తెలియదు. అంకారా నుంచి బయలుదేరిన విమానంలోకి కిటికీల పరదాలు మూసి ఉంచాలని రిపోర్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ట్రంప్ పెద్ద విమానంలోనే ఉన్నారని ప్రపంచం నమ్మేలా సీక్రెట్ సర్వీస్‌ జాగ్రత్త పడింది. బ్రిటన్ చేరుకున్న తర్వాత మాత్రమే, ఆయన చిన్న విమానం నుంచి దిగి మళ్లీ పెద్ద విమానంలోకి మారడం గమనించారు. 

ఖతార్ బహుమతిగా ఇచ్చిన విమానానికి కొత్త చిక్కులు 

ట్రంప్‌ పాత ఎయిర్‌ ఫోర్స్‌ వన్ విమానాలను విమర్శించిన తర్వాత, ఖతార్ రాజకుటుంబం ఈ అత్యాధునిక విలాసవంతమైన విమానాన్ని అమెరికాకు బహుమతిగా ఇచ్చింది. అయితే దీనికి క్షిపణి దాడుల నుంచి రక్షణ పొందే సామర్థ్యం ఉందా లేదా అనే దానిపై ఇప్పుడు తీవ్ర చర్చ జరుగుతోంది. వైట్‌ హౌస్‌ మాత్రం ఈ విమానం స్టేట్ ఆఫ్‌ ది ఆర్ట్‌ టెక్నాలజీ తో కూడి ఉందని, అధ్యక్షుడి భద్రత విషయంలో ఎక్కడా రాజీ పడలేదని స్పష్టం చేస్తోంది. 

ఇరాన్ వైఖరి 

ఈ హత్యా ప్రయత్న వార్తలు వెలువడటానికి ముందే, ఇరాన్, ట్రంప్ మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. యుద్ద నష్టపరిహారం కింద ఇరాన్ 300 బిలియన్ డాలర్లు డిమాండ్ చేయగా, ట్రంప్‌ దానిని తిరస్కరించడమే కాకుండా, ఇరాన్ వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆ దేశమే పరిహారం చెల్లించాల్సి ఉంటుందని డిమాండ్ చేశారు. ఇటువంటి ఉద్రిక్తతల మధ్య ఈ కుట్ర వెలుగులోకి రావడం సంచలనంగా మారింది.