India PM Modi | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత ప్రధాని నరేంద్ర మోదీని మెచ్చుకున్నారు. ఈజిప్టులో జరిగిన గాజా శాంతి సదస్సులో పాల్గొన్న సందర్భంగా ట్రంప్ (Donald Trump) ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా పాల్గొన్నారు. 

Continues below advertisement

ట్రంప్ తన ప్రసంగంలో.. "భారత్ ఒక గొప్ప దేశం, నా గుడ్ ఫ్రెండ్ దేశానికి అధినేతగా ఉన్నారు. మోదీ అద్భుతంగా పనిచేస్తున్నారు. భారత్, పాకిస్తాన్ ఇప్పుడు గతంలోలాగ సాధారణంగా ఉంటాయని భావిస్తున్నాను" అని అన్నారు. అదే సమయంలో డొనాల్డ్ ట్రంప్ నవ్వుతూ పాక్ ప్రధాని షరీఫ్ వైపు చూసి, "రైట్?" అని అడిగారు, దీనికి ఏం సమాధానం చెప్పాలో  అర్థం కాకున్నా షరీఫ్ నవ్వుతూ తల ఊపారు.

షెహబాజ్ షరీఫ్ తన ప్రకటనలో భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపిన ఘనతను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నకు ఇచ్చారు. గాజా సమ్మిట్‌కు ముందు ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని నివారించడానికి తాను 200 శాతం సుంకాలు విధిస్తానని బెదిరించి, అంతా సెటిల్ చేశానని ట్రంప్ పేర్కొన్నారు.

Continues below advertisement

ట్రంప్ ఇంకా ఏమన్నారు?

గాజా శాంతి సదస్సులో ట్రంప్ మాట్లాడుతూ.. మీ ఇద్దరూ (భారత్, పాక్) యుద్ధం చేయాలి అనుకుంటే, మీ దగ్గర అణ్వాయుధాలు ఉంటే, మీ ఇద్దరిపై 100%, 150%, 200% వరకు టారిఫ్ విధిస్తాను అని చెప్పాను. దాంతో భారత్, పాక్ అధినేతలు అలా చేయవద్దు అన్నారు. ఆ విధంగా నేను 24 గంటల్లో ఇరుదేశాల మధ్య సమస్యను పరిష్కరించాను" అన్నారు. కాల్పుల విరమణ లేదా కాల్పుల విరమణ నిర్ణయం అయినా 2 దేశాల పరస్పర అంగీకారంతో జరిగిందని, ఇందులో మూడో దేశం జోక్యం చేసుకోవడం వల్ల కాదని భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది.

ట్రంప్ కోసం నోబెల్ బహుమతి కోరిన పాక్ 

భారత్, పాక్ మధ్య యుద్ధాన్ని ఆపినందుకు అమెరికా అధినేత ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని షెహబాజ్ షరీఫ్  డిమాండ్ చేశారు. "భారత్, పాకిస్తాన్ మధ్య శాంతిని నెలకొల్పడానికి ట్రంప్, ఆయన టీం చేసిన కృషి అసాధారణమైనది" అని అన్నారు. పాకిస్తాన్ కొన్ని రోజుల కింద సైతం దౌత్యపరమైన జోక్యం, నాయకత్వం చేస్తున్నందుకు నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ పేరును ప్రతిపాదించింది. అయితే, 2026లో వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరినా మచాడోకు నోబెల్ శాంతి బహుమతి లభించింది.