De-extinction of Direwolves:సైన్స్ అద్భుతం సృష్టించింది. అసాధ్యం అనుకున్నదాన్ని సుసాధ్యం చేసింది. ఎప్పుడో 12 వేల సంవత్సరాల క్రితం అంతరించి పోయిన మహా తోడేలు (డైర్ ఉల్ఫ్ ) జాతిని తిరిగి సృష్టించారు శాస్త్రవేత్తలు. సైన్సు పుస్తకాల్లోనూ, గ్రీకు, రోమన్ పురాణాల్లోనూ కనిపించే ఈ డైర్ ఉల్ఫ్ ఇప్పుడు మన కళ్ళ ముందే తిరుగాడేలా సైంటిస్టులు పునఃసృష్టి చేశారు.
అసాధ్యాన్ని సుసాధ్యం చేసాం : కొల్లాసల్ బయో సైన్సెస్ కంపెనీఎప్పుడో 12 వేల సంవత్సరాల క్రితమే అంతరించిపోయిన డైర్ ఉల్ఫ్స్‌ను అచ్చం జురాసిక్ పార్క్‌లో డైనోసార్లను ఎలా తిరిగితెస్తారో అలాగే DNAలను కలెక్ట్ చేసి పునరుత్పత్తి చేశామని డల్లాస్‌కు చెందిన కొల్లాసల్ బయో సైన్సెస్ (Colossal Biosciences) సంస్థ తెలిపింది. మొత్తం మూడు డైర్ ఉల్ఫ్ పిల్లలను తాము సృష్టించామని వాటిలో రెండు మగవి ఒకటి ఆడదని ఆ సంస్థ చెప్పింది. మగవాటికి "రోములస్, రేమూస్ "అనీ ఆడదానికి "ఖలీసీ " అని పేరు పెట్టామని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. వేల ఏళ్ల నాటి శిలాజాల నుంచి DNA సంపాదించి వాటిని క్లోనింగ్, జీన్- ఎడిటింగ్ లాంటి ప్రక్రియల ద్వారా ఈ అద్భుతాన్ని సృష్టించామని ఆ సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం జీవించి ఉన్న తోడేళ్లలో అతి పెద్దదైన గ్రే ఉల్ఫ్ కంటే కూడా ఈ డైర్ ఉల్ఫ్స్ పెద్దగా ఉంటాయి. వీటి శిలాజాలు నార్త్,సౌత్ అమెరికా ఖండాలతోపాటు తూర్పు ఆసియా దేశాల్లోనూ దొరికాయి. దానివల్ల అనేక రకాల వాతావరణ పరిస్థితులను ఇవి తట్టుకోగలరని సైంటిస్టులు భావిస్తున్నారు.
ముందు అనుకున్నవి ఇవి కావునిజానికి డి-ఎక్స్ టింక్షన్ ప్రోగ్రాం ద్వారా ముందుగా 1662లో అంతరించిపోయిన మారిషస్‌కు చెందిన ఎగరలేని పక్షి "డోడో "(Dodo), 12 వేల సంవత్సరాల క్రితం అంతరించిపోయిన మంచు పర్వతాల్లో తిరిగే ఊలు ఏనుగు (మామూత్)లను తిరిగి సృష్టించాలని శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. కానీ ఈ కొల్లసిల్ బయోసైన్సెస్ సంస్థ డైర్ ఉల్ఫ్ సృష్టించినట్టు ప్రకటించి సంచలనం రేపింది.
నెటిజన్స్ డౌట్స్‌కు సంస్థ ఆన్సర్ ఇదేసంస్థ రిలీజ్ చేసిన వీడియోపై కొందరు నెటిజెన్స్ డౌట్స్ వ్యక్తపరిచారు. నిజంగానే డైర్ ఉల్ఫ్‌ను తిరిగి సృష్టించారా లేక ఇది ఏ AIతో మ్యాజిక్కా అని వారు అడిగారు. దానికి సమాధానం ఇస్తూ ఈ మూడు తోడేళ్ల పిల్లలు ఎదిగే క్రమాన్ని తమ సంస్థ యూట్యూబ్ ఛానల్‌లో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తున్నామని దానిని చూసి వాస్తవాన్ని నిర్ధారించుకోవచ్చని ఈ బయోటెక్ కంపెనీ తెలిపింది. ఏదేమైనా అంతమైపోయిన జీవులను వేల ఏళ్ల తర్వాత తిరిగి సృష్టించామంటూ కొల్లాసల్ బయో సైన్సెస్ సంస్థ సైన్స్ ప్రపంచంలో అతిపెద్ద సంచలనం రేపింది.