Just In





Viral Video: ప్రమాదవశాత్తు గాల్లోకి ఎగిరి కుప్ప కూలిన రాకెట్, భారీగా ఎగిసిపడిన మంటలు
Watch Video: చైనాలో ప్రమాదవశాత్తూ గాల్లోకి ఎగిరిన రాకెట్ కాసేపటికే కుప్ప కూలింది. ఓ కొండ ప్రాంతంలో కూలడం వల్ల భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి.

Rocket Crash in China: చైనాలో ఓ రాకెట్ గాల్లోకి ఎగిరిన కాసేపటికే కుప్ప కూలిపోయింది. లాంచ్‌ప్యాడ్ వద్ద ఉన్న రాకెట్ ఇలా ప్రమాదానికి గురైంది. Space Pioneer సంస్థకి చెందిన రాకెట్‌లో లోపం తలెత్తింది. Tianlong-3 రాకెట్‌ని లాంచ్‌ప్యాడ్ వద్ద ఉంచిన సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు అక్కడి మీడియా వెల్లడించింది. లాంచ్ ప్యాడ్ నుంచి విడిపోయి ఓ కొండ ప్రాంతంలో కుప్ప కూలింది. అయితే..ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం నమోదు కాలేదు. కాకపోతే రాకెట్ కూలడం వల్ల పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆ మంటలు ఆర్పింది.
చైనాలోని రాకెట్ తయారు చేసే సంస్థల్లో Space Pioneer కంపెనీ కూడా ఒకటి. ఈ మధ్య కాలంలో అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకుంది. ఖర్చు తగ్గించుకోవడంలో భాగంగా పునర్వినియోగ రాకెట్స్‌ని తయారు చేస్తోంది. ఇందులో భాగంగానే Tianlong-3 రాకెట్‌ని తయారు చేసింది. దీన్నే Sky Dragon 3 గానూ పిలుస్తోంది చైనా. ఇది రీయూజబుల్ రాకెట్. దీన్ని ప్రయోగించిన సమయంలో ప్రమాదం జరిగింది. రాకెట్ అవశేషాలు సురక్షిత ప్రాంతంలోనే పడిపోయాయని, ఎలాంటి నష్టం జరగలేదని స్థానిక మీడియా తెలిపింది. చైనాలో ఇలాంటి ఘటనలు గతంలోనూ జరిగాయి. అయితే...అభివృద్ధి దశలోనే ఉండగా ఇలాంటి ప్రమాదం జరగడం మాత్రం తొలిసారి. గతేడాది ఏప్రిల్‌లో స్పేస్ పయనీర్ సంస్థ కిరోసిన్ ఆక్సిజన్ రాకెట్ Tianlong-2 ని ప్రయోగించింది. చైనాలో ఓ ప్రైవేట్ సంస్థకు చెందిన liquid propellant రాకెట్ స్పేస్‌లోకి వెళ్లడం అదే తొలిసారి.