Jack Ma Pakistan Trip: 


జూన్ 29న పర్యటన..


చైనా బిలియనీర్ Alibaba Group కో ఫౌండర్ జాక్‌ మా పాకిస్థాన్‌లో పర్యటించడం సంచలనమవుతోంది. పాకిస్థాన్‌కి చెందిన The Express Tribune వార్తా సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. బోర్డ్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ (BOI) మాజీ ఛైర్మన్ మహమ్మద్ అజ్ఫర్ అసన్ జాక్‌ మా పర్యటనపై కీలక విషయాలు చెప్పారు. ఆయన జూన్ 29న పాకిస్థాన్‌కి వచ్చారని దాదాపు 23 గంటల పాటు ఇక్కడే ఉన్నారని కన్‌ఫమ్ చేశారు. అయితే...పాకిస్థాన్ ప్రభుత్వంతో కానీ, అక్కడి మీడియాతో కానీ మాట్లాడేందుకు జాక్‌ మా ఆసక్తి చూపలేదట. ఓ ప్రైవేట్ లొకేషన్‌లో ఉండి జూన్ 30న ఓ ప్రైవేట్‌ జెట్‌లో వెళ్లిపోయారని స్థానిక మీడియా రిపోర్ట్ చేసింది. జాక్‌ మా ఎందుకు వచ్చారన్నది మాత్రం సీక్రెట్‌గానే ఉంచారు. కానీ...త్వరలోనే పాకిస్థాన్‌కి ఆయన తీపి కబురు చెబుతారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. జాక్‌ మా ఒంటరిగా రాలేదట. ఆయనతో పాటు 7గురు బిజినెస్‌మేన్‌లున్నారని సమాచారం. వారిలో 5గురు చైనాకి చెందిన వాళ్లే. అంతకు ముందు నేపాల్‌లో పర్యటించిన జాక్ మా అక్కడి నుంచి నేరుగా పాకిస్థాన్‌కి వెళ్లారు. అక్కడ వ్యాపార అవకాశాలు ఎలా ఉన్నాయో పరిశీలించేందుకు పర్యటించి ఉంటారని కొందరు ఎక్స్‌పర్ట్‌లు చెబుతున్నారు. అందుకు తగ్గట్టుగానే జాక్ మా టీమ్..పలు ట్రేడ్‌ సెంటర్లను విజిట్ చేసింది. చాంబర్స్ ఆఫ్ కామర్స్‌కి చెందిన అధికారులతోనూ భేటీ అయింది. బడా బిజినెస్‌మేన్‌లతోనూ చర్చలు జరిపింది. కానీ...పక్కాగా ఈ డీల్ కుదిరింది అని చెప్పడానికి మాత్రం లేదు. అది కాన్ఫిడెన్షియల్‌గానే ఉంచారు. 


పర్సనల్..


మహ్మద్ అజ్ఫర్ అసన్ మాత్రం జాక్‌ మా పర్యటన కేవలం పర్సనల్ అని, అంతకు మించి ఎక్కువగా ఆలోచించాల్సిన పని లేదని తేల్చి చెప్పారు. ఇక్కడ మరీ ఆసక్తికర విషయం ఏంటంటే...చైనా ఎంబసీకి కూడా జాక్ మా పర్యటన గురించి ఎలాంటి సమాచారం లేదు. పాక్‌లో ఐటీ రంగాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి జాక్‌ మా ప్రయత్నిస్తున్నారా..? అన్న వాదన కూడా వినిపిస్తోంది. ఇక జాక్ మా నేపాల్ పర్యటన గురించి చాలా కొద్ది మంది అధికారులకు మాత్రమే తెలుసని సీనియర్ ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. అలాంటి ధనవంతుడు నేపాల్ ను సదర్శించడానికి వచ్చినప్పుడు ఆయనను స్వాగతించడానికి ఎలాంటి కారణం ఉండదని వ్యాఖ్యానించారు. జాక్ మా.. ప్రధానమంత్రి పుష్ప కమల్ దహల్ అలాగే ఆర్థిక మంత్రి ప్రకాష్ శరణ్ మహత్ లను కలవాలని ప్రత్యేకంగా అభ్యర్థించినట్లు వారి ప్రైవేట్ సెక్రటేరియట్ లు ధృవీకరించాయి. నేపాల్ లో జాక్ మా ఇతర షెడ్యూల్ అంతా రహస్యంగా ఉంచినట్లు సీనియర్ భద్రతా అధికారి ఒకరు తెలిపారు. 2020లో షాంఘైలో జరిగిన ఓ సమావేశంలో ప్రభుత్వ ఆర్థిక విధానాలపై విమర్శలు చేశారు జాక్‌ మా. అది ప్రభుత్వానికి ఆగ్రహం కలిగించింది. అప్పటి నుంచి ఆయనపై పగ పట్టింది. 2021లో జాక్ మా వ్యాపారాలపై ఆంక్షలు విధించింది చైనా ప్రభుత్వం. జాక్‌ మా మాట్లాడటం అదే చివరి సారి.


Also Read: అబ్బో అదో నరకం, భరించడం మా వల్ల కాదు - పెళ్లిపై ఇంట్రెస్ట్ చూపించని చైనా యూత్