China Publicly Humiliated Pakistan Field Marshal Munir:  చైనా ఫీల్డ్ మార్షల్ అసీమ్ మునీర్‌కు  బీజింగ్‌లో ఘోర అవమానం జరిగింది.   అసీమ్   జూలై 25న చైనా రాజధాని బీజింగ్‌కు అధికారిక పర్యటన కోసం వెళ్లారు. ఈ సందర్భంగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఆయనను అందరి ముందు తీవ్రంగా మందలించారు.  చైనా-పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ (CPEC) ప్రాజెక్టులలో పనిచేస్తున్న చైనా పౌరుల భద్రతపై చైనా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది.  
 
 ఫీల్డ్ మార్షల్ అసీమ్ మునీర్ చైనా పర్యటనలో భాగంగా విదేశాంగ మంత్రి వాంగ్ యీ, ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్,   సెంట్రల్ మిలిటరీ కమిషన్ వైస్ చైర్మన్ జనరల్ జాంగ్ యూక్సియా సహా అనేక మంది చైనా రాజకీయ,  సైనిక నాయకులతో సమావేశమయ్యారు. CPEC ప్రాజెక్టులలో పనిచేస్తున్న చైనా పౌరులపై బలోచ్ లిబరేషన్ ఆర్మీ (BLA),  ఇతర తీవ్రవాద సమూహాల నుండి పెరుగుతున్న దాడులపై వారంతా అసంతృప్తి వ్యక్తంచేసారు. ఈ దాడులు  చైనా  60 బిలియన్ డాలర్ల పెట్టుబడులను రిస్క్‌లో పడేస్తున్నాయి. అందుకే చైనా తీవ్ర ఆగ్రహంతో ఉంది. 
 
చైనా-పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ (CPEC)  చైనా   బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (BRI)లో కీలకం.   ఇది గ్వాదర్ ఓడరేవు, రహదారులు, రైలు మార్గాలు వంటి భారీ ప్రాజెక్టులతో ఉంది.  ఈ ప్రాజెక్టులలో పనిచేస్తున్న చైనా ఇంజనీర్లు, కార్మికులు,   కాంట్రాక్టర్లపై దాడులు జరుగుతున్నాయి. బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) ఆత్మాహుతి దాడిలో  పలువురు చైనా పౌరులు మరణించారు.   పాకిస్తాన్ ప్రధాని షెబాజ్ షరీఫ్ ,  సైనిక నాయకత్వం చైనా పౌరుల భద్రతకు హామీ ఇచ్చినప్పటికీ, ఈ దాడులు కొనసాగుతున్నాయి.ఇది చైనాకు ఆగ్రహం తెప్పిస్తోంది.  

Continues below advertisement


 బలోచిస్తాన్ ,  ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలో తీవ్రవాద దాడులు CPEC ప్రాజెక్టులను లక్ష్యంగా చేసుకున్నాయి. బలోచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) చైనా , పాకిస్తాన్‌లను బలోచిస్తాన్‌లోని సహజ వనరుల దోపిడీకి దారితీస్తున్నాయని ఆరోపిస్తోంది.  పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం, తాలిబాన్ సమూహాల సరిహద్దు కార్యకలాపాలు,  బలోచిస్తాన్‌లో కొనసాగుతున్న తిరుగుబాటు దేశంలోని భద్రతా సవాళ్లను మరింత తీవ్రతరం చేస్తున్నాయి.   పాకిస్తాన్ సైన్యం  అన్ని చోట్ల భద్రతను నిర్వహించడంలో విఫలమవుతోంది. 





 
బీజింగ్‌లో జరిగిన సమావేశంలో, వాంగ్ యీ మునీర్‌కు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు.  పాకిస్తాన్‌లోని చైనా పౌరులు, ప్రాజెక్టులు, మరియు సంస్థల భద్రత కోసం   పాకిస్తాన్ సైన్యం “పూర్తి స్థాయిలో ప్రయత్నాలు” చేయాలని  స్పష్టం చేశారు.  గట్టిగా హెచ్చరిస్తున్నట్లుగా ఉండటంతో మునీర్ ఏం మాట్లాడలేకపోయారు.  ఈ గద్దింపు కేవలం రహస్య చర్చలకే పరిమితం కాలేదు. చైనా  ప్రభుత్వం Xinhua న్యూస్ ఏజెన్సీ ద్వారా వాంగ్ యీ   వ్యాఖ్యలను బహిరంగంగా ప్రకటించారు.  దీని ద్వారా చైనా తన అసంతృప్తిని అంతర్జాతీయంగా స్పష్టం చేసినట్లయింది.  చైనా ఆగ్రహంతో మునీర్ చైనా పౌరుల భద్రతకు హామీ ఇవ్వడానికి సైనిక గస్తీలను పెంచడం, సైట్ భద్రతను గట్టిపరచడం,  తీవ్రవాద  గ్రూపులపై దాడి చేయడం వంటి చర్యలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు.  


మునీర్ కు చైనా చేతిలో  భారీ అవమానం జరిగిందని పాకిస్తాన్ లో ప్రజలు ఊసురుమంటున్నారు. చైనా కాలు కింద చెప్పులా పడి ఉండాల్సిందేననని గొణుక్కుంటున్నారు.