China Announces New K Visa:  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H-1B వీసా ఫీజును సంవత్సరానికి  100,000 డాలర్లకు అంటే  సుమారు రూ. 84 లక్షలుకి పెంచారు. దీనిపై చర్చ జరుగుతున్న సమయంలో  చైనా తన 'K వీసా' కేటగిరీని ప్రకటించింది. ఈ కొత్త వీసా, యువ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ (STEM) ప్రొఫెషనల్స్‌ను ఆకర్షించడానికి రూపొందించారు.  అక్టోబర్ 1, 2025 నుంచి అమలులోకి వస్తుంది. ట్రంప్ చర్యలు భారత్, చైనా వంటి దేశాల ప్రొఫెషనల్స్‌లో భయాన్ని రేపడంతో, చైనా ఈ అవకాశాన్ని  అందుకునే ప్రయత్నం చేస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.   

సెప్టెంబర్ 19న ట్రంప్ స్థానికుల ఉద్యోగాలను కాపాడటానికి H-1B వీసా ప్రోగ్రామ్‌పై కఠిన చర్యలు ప్రకటించారు. ఈ వీసా, అమెరికాలో హైలీ స్కిల్డ్ వర్కర్స్‌కు  ముఖ్యంగా IT, టెక్ ఉపయోగపడుతుంది. ఇప్పటి వరకూ  లాటరీ, అప్లికేషన్ ఫీజు  సుమారు  6,000 డాలర్లు మాత్రమే ఉండేది.  కానీ ఇప్పుడు  వన్ టైం ఫీజు కింద 100,000 డాలర్లు చేశారు.  ఈ ఫీ ఎంప్లాయర్లు చెల్లించాలి. 3-6 సంవత్సరాల వీసా పీరియడ్‌కు వర్తిస్తుంది. ట్రంప్ నిర్ణయం అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా, గూగుల్‌లకు భారీ షాక్‌గా మారింది. H-1B వీసాలలో 71 శాతంభారతీయులు, 11.7శాతం చైనీయులు ఉన్నారు. ఫెబ్రవరీ 2026 లాటరీ నుంచి అమలవుతుంది.  ఈ క్రమంలో చైనా స్టేట్ కౌన్సిల్, ప్రీమియర్ లి చియాంగ్ సంతకంతో, ఫారినర్స్ ఎంట్రీ-ఎగ్జిట్ రెగ్యులేషన్స్‌లో మార్పులు ప్రకటించింది. మునుపు 12 ఆర్డినరీ వీసా కేటగిరీలు (Z వర్క్, X స్టడీ, M బిజినెస్) ఉండగా, 13వదిగా 'K వీసా' చేర్చారు. ఇది చైనా  'టాలెంట్ పవర్ స్ట్రాటజీ'లో భాగం, 2035 నాటికి టెక్ సూపర్‌ పవర్‌గా మారాలనే లక్ష్యంలో  భాగంగా ఈ వీసా తీసుకు వచ్చారు. 

 

చైనా K వీసాకు ఎవరు  అప్లై చేయవచ్చు   - యువ STEM ప్రొఫెషనల్స్ (బ్యాచిలర్ డిగ్రీ లేదా అధికం, చైనా/ఫారిన్ యూనివర్సిటీల నుంచి).- రీకగ్నైజ్డ్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో టీచింగ్/రీసెర్చ్ చేస్తున్నవారు.- వయసు, ఎడ్యుకేషన్, వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవారు- డాక్యుమెంట్స్: క్వాలిఫికేషన్ ప్రూఫ్, ప్రొఫెషనల్/రీసెర్చ్ ఎవిడెన్స్ 

 ప్రయోజనాలు - మల్టిపుల్ ఎంట్రీ/ఎగ్జిట్, లాంగర్ వాలిడిటీ పీరియడ్, ఎక్స్‌టెండెడ్ స్టే (ప్రస్తుత 12 వీసాల కంటే ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ).- లోకల్ ఎంప్లాయర్ స్పాన్సర్‌షిప్ అవసరం లేదు.- చైనాలో వర్క్, ఎడ్యుకేషన్, కల్చరల్ ఎక్స్చేంజెస్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, బిజినెస్ అక్టివిటీలు చేయవచ్చు.- సింప్లిఫైడ్ అప్లికేషన్ ప్రాసెస్, తక్కువ ఫీ (H-1B కంటే చాలా తక్కువ).

ఈ వీసా చైనా ఇన్నోవేషన్ హబ్‌లు టెక్ పార్కులు, బయోటెక్, AI స్టార్టప్‌లు)కు తోడ్పడుతుంది. 2025 మొదటి అర్ధంలో చైనాకు 38 మిలియన్ ఫారిన్ ట్రిప్స్ వచ్చాయి, వీసా-ఫ్రీ ఎంట్రీలు 53.9% పెరిగాయి.  చైనా K వీసా దక్షిణాసియా ముఖ్యంగా భారత్ ప్రొఫెషనల్స్‌ను ఆకర్షిస్తుంది.