Elon Musk calls Cancel Netflix: టెస్లా , స్పేస్‌ఎక్స్‌ల సీఈఓ ఎలాన్ మస్క్, తన నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేసి, తన 1.9 బిలియన్ ఫాలోవర్లను కూడా అలాగే చేయమని పిలుపునిచ్చాడు. "పిల్లల ఆరోగ్యం కోసం నెట్‌ఫ్లిక్స్‌ను రద్దు చేయండి" అని X లో పోస్ట్ చేసిన మస్క్ పోస్ట్‌లు వైరల్ అయ్యాయి.
ఈ క్యాంపెయిన్, ట్రాన్స్‌జెండర్ థీమ్‌లతో కూడిన పిల్లల కార్టూన్ షోలు, డైవర్సిటీ రిపోర్ట్‌లో 'వైట్ డిస్‌క్రిమినేషన్' వంటి విషయాలపై ఆధారపడి ఉంది. #CancelNetflix హ్యాష్‌ట్యాగ్ Xలో ట్రెండింగ్‌గా మారింది. ఈ కారణంగా నెట్‌ఫ్లిక్స్ షేర్లు 2% పడిపోయాయి.
మస్క్ ఉద్యమం కన్జర్వేటివ్ వర్గాల నుంచి మద్దతు పొందుతోంది. "డెడ్ ఎండ్: పేరానార్మల్ పార్క్" అనే 2022-23లో విడుదలైన అనిమేటెడ్ సిరీస్ లో ట్రాన్స్‌జెండర్ క్యారెక్టర్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. దాని సృష్టికర్త హమిష్ స్టీల్‌పై వివాదాలు విమర్శలువచ్చాయి. స్టీల్, బ్రిటిష్ అనిమేషన్ డైరెక్టర్ , ఓపెన్‌గా గేగా ప్రకటించుకున్నారు. అలాగే ఇటీవల హత్యకు గురైన చార్లీ కిర్క్‌ను "నాజీ"గా అవమానించిన కామెంట్లు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి.
అలాగే 'ది బేబీ-సిట్టర్స్ క్లబ్' షో, పిల్లలలో ట్రాన్స్‌జెండరిజమ్‌ను ప్రోత్సహిస్తోందని మస్క్ ఆరోపిస్తున్నారు. లిబ్స్ ఆఫ్ టిక్‌టాక్ అకౌంట్ పోస్ట్ చేసిన వీడియోను కోట్ చేసి, మస్క్ "క్యాన్సిల్ నెట్‌ఫ్లిక్స్" అని పిలుపునిచ్చాడు. ఈ షో, పిల్లల రేటింగ్‌తో వస్తుంది, కానీ LGBTQ+ థీమ్‌లు కలిగి ఉన్నాయి. మరో పోస్ట్‌లో, నెట్‌ఫ్లిక్స్ 'ఇన్‌క్లూజన్ & డైవర్సిటీ రిపోర్ట్'ను టార్గెట్ చేశాడు, ఇందులో శ్వేతేతర డైరెక్టర్లు, లీడ్ క్యారెక్టర్ల సంఖ్య పెరగడాన్ని ఆయన గుర్తించారు. "స్కిన్ కలర్ ఆధారంగా హైరింగ్ కాదు, అర్హతల ఆధారంగా చేయాలి" అని మస్క్ వాదిస్తున్నారు.
ఈ క్యాంపెయిన్, కల్చర్ వార్స్‌లో కొత్త అధ్యాయంగా చూస్తున్నారు. మస్క్ పోస్ట్‌లు 69 మిలియన్‌కు పైగా వ్యూస్ సాధించాయి, ట్‌ఫ్లిక్స్ ఇంకా అధికారికంగా స్పందించలేదు .