పోప్ ఫ్రాన్సిస్ సోమవారం ఒక వీడియో ప్రకటనలో 88 సంవత్సరాల వయసులో రోమ్‌లో కన్నుమూశారు. ఈ విషయాన్ని వాటికన్ ధృవీకరించింది. గత కొంతకాలం నుంచి వయసురీత్యా ఆయన అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. ఈ క్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని వాటికన్ తెలిపింది. రోమన్ కాథలిక్ చర్చికి నాయకత్వం వహించిన తొలి లాటిన్ అమెరికన్ గా ఆయన ఫేమస్. ఆయన మార్చి 13, 2013న సుప్రీం పోప్‌గా ఎన్నికయ్యారు.  అర్జెంటీనాలో 1936 డిసెంబర్‌ 17న పోప్‌ ఫ్రాన్సిస్‌ జన్మించారు.

ఊపిరితిత్తులలో న్యుమోనియా, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో పోప్ వారం రోజుల కిందట జెమెల్లి ఆసుపత్రిలో చేరి, కోలుకున్నారని వాటికన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఊపిరితిత్తుల సమస్య, రక్తహీనతతో సంబంధం ఉన్న ప్లేట్‌లెట్ సమస్య గుర్తించిన అనంతరం ఆయనకు రక్త మార్పిడి కూడా జరిగింది. ఈస్టర్‌ సందర్భంగా ఆయన ఆదివారం ఆయన తన చివరి సందేశమిచ్చారు.

రోమన్ కాథలిక్ చర్చికి నేతృత్వం వహించిన మొట్టమొదటి లాటిన్ అమెరికన్ నేత పోప్ ఫ్రాన్సిస్ అని వాటికన్ సోమవారం ఒక వీడియో ప్రకటనలో తెలిపింది. విభజన, ఉద్రిక్తతతో తరచుగా అల్లకల్లోలం జరిగితే అన్నింటిని సరిరిదిద్దడానికి ఆయన ప్రయత్నించారు.

ఐదుగురు సంతానంలో ఒకరు..

రైల్వేలో అకౌంటెంట్‌గా పనిచేసిన ఇటాలియన్ వలసదారు మారియో, రెజీనా సివోరి దంపతుల ఐదుగురు సంతానంలో పోస్ ఫ్రాన్సిస్ ఒకరు. కెమికల్ టెక్నీషియన్‌గా పట్టభద్రుడైన తర్వాత, ఆయన పాస్టర్ గా మారాలని నిర్ణయించుకున్నారు. అనంతరం విల్లా డెవోటో డియోసెసన్ సెమినరీలో ప్రవేశించారు. మార్చి 11, 1958న సొసైటీ ఆఫ్ జీసస్ యొక్క నోవిషియేట్‌లో ఆయన చేరారు.

ఒక పోప్ మరణం తర్వాత ఏం జరుగుతుంది?

ఒక పోప్ మరణం రోమన్ కాథలిక్ చర్చిలో సంతాప కాలం, పరివర్తనను ప్రారంభిస్తుంది. కొత్త పోప్‌ను ఎన్నుకోవడానికి జాగ్రత్తగా నిర్మాణాత్మక ప్రక్రియ చేపడతారు. అంతకుముందు, ఫ్రాన్సిస్ తాను రాజీనామా లేఖ రాశానని, కొత్త పోప్ పై నిర్ణయం తీసుకోవాలని ఇటీవల సూచించారని తెలిపింది. కొత్త పోప్ ఎంపిక చేయకపోతే రాజీనామా లేఖను అమలుచేయాలని కోరతానని ఇటీవల అన్నారు.