Boozed up soldiers caught having intercourse in Apache helicopter:  లండన్‌లో ఆర్మీ విమానాల సర్వీసింగ్ సెంటర్‌లో ఓ హెలికాఫ్టర్ నుంచి అదే పనిగా శబ్దాలు రావడంతో సైనికులు అప్రమత్తమయ్యారు. ఏదైనా కుట్ర జరిగిందేమో అని అయుధాలతో అలర్ట్ అయిపోయారు. మెల్లగా ఆ హెలికాఫ్టర్ దగ్గరకు వెళ్తున్న కొద్దీ వారికి ఏదో తేడా కొట్టింది. ఎందుకంటే రోడ్డు మీద ఆగి ఉన్న కారులో బంప్స్ ఎలా వస్తాయో .. హెలికాఫ్టర్‌లో అలాగే వస్తున్నాయి. పైగా లోపల నుంచి మూలుగులు కూడా వస్తున్నాయి. ఆడా, మగా ఇద్దరూ ఏదో ప్రైవేటు పనిలో ఉన్నప్పుడు వచ్చే మూలుగులు అవి.                            


హెలికాప్టర్ దగ్గరకు వెళ్లిన సైనికులకు అక్కడ ఓ జంట కనిపించింది. ఆ జంట ఎవరో చూసి వాళ్లు కూడా అవాక్కయ్యారు. నిజానికి అది మిలటరీ బేస్‌లో ఉంటుంది. ఎవరూ రాలేరు కూడా. అక్కడ ఎవరైనా అలాంటి పనులు బయట వాళ్లు వచ్చి చేయలేరు. సోల్జర్స్ నే చేయాలి. అందుకే ఎవరో తమ తోటి సోల్జర్సే హెలికాప్టర్ సర్వీసింగ్‌ చేయమని పంపిస్తే..తమ సర్వీసింగ్ చేసుకుంటున్నారని అర్థం చేసుకున్నారు. అప్పటికి అయితే వారిని డిస్ట్రబ్ చేయలేదు. కానీ వార్ హెలికాప్టర్‌లో ఇలాంటి యుద్ధాలు జరగడం.. చేయడం ఖచ్చితంగా క్రమశిక్షణా రాహిత్యమే కాబట్టి తెలిసినా పై అధికారులుక చెప్పకపోవడం పెద్ద తప్పు అవుతుందని పై అధికారులకు సమాచారం ఇచ్చారు.   


Also Read:  ఎక్కడా చోటు లేనట్లు ఒబామా భార్య బాత్‌రూమ్‌లో లవర్‌తో శృంగారం - అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ ఉద్యోగం ఫట్ !


ఇంగ్లాండ్‌లో మేల్, ఫీమేల్ సైనికులు ఉంటారు. కొన్ని కొన్ని విభాగాల్లో కలసి పని చేస్తూంటారు. వార్ హెలికాప్టర్ల సర్వీసింగ్ విభాగాల్లో మహిళలు కూడా ఉంటారు. వారు కూడా సైనికులే. హెలికాఫ్టర్ల సర్వీసింగ్‌లో నిపుణులైన వారిని అక్కడ నియమిస్తారు. ఇలా నియమించిన వారిలో ఇద్దరు సర్వీసింగ్ చేస్తూ ఆకర్షణకు లోనయ్యారో.. ముందుగానే ప్లాన్ చేసుకున్నారో కానీ హెలికాప్టర్ కాక్ పిట్‌ను ఉపయోగించేసుకున్నారు. వారు ఆ పని చేస్తున్నట్లుగా గుర్తించిన సైనికులు..అంతా అయిపోయిన తర్వతా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ సమయంలో వారు అర్థనగ్నంగా ఉన్నారని పై అధికారులకు నివేదిక ఇచ్చారు.                            


Also Read:కెనడా మాదే తెల్లోళ్లు యూరోప్ వెళ్లిపోవాలి- ఖలీస్థానీ సపోర్టర్ల కొత్త డిమాండ్ ! తిక్క కుదిరినట్లే !


ఈ ఘటనను మిలటరీ కూడా ధృవీకరించింది. వారిద్దరూ పట్టుబడిన సమయంలో సగం దుస్తులతో మాత్రమే ఉన్నారు. మగ సైనికుడు సైనిక దుస్తుల్లోనే ఉన్నారని చెప్పిది. వారి అసలైన విభాగం నుంచి ఉన్నతాధికారులు వచ్చే వరకు వారిని బంధించి ఉంచినట్లుగా తెలిపింది. తర్వాత వారిపై చర్యలు తీసుకున్నారు. అయితే ఇది ఇప్పుడు జరిగింది కానీ 2016లో జరిగిందని ఇటీవల ఓ కంప్యూటర్ గ్లిచ్ వల్ల బయట పడిందని చెబుతున్నారు.