Just In





Bill Gates : నాలుగో తరగతిలో బిల్ గేట్స్ రాక్స్ - టీచర్ షాక్స్ - ఆవు మూత్రపిండాలు తీసుకెళ్లాడట మరి !
Bill Gates : బిల్ గేట్స్ గురించి ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆయన ఎంత భిన్నంగా ఆలోచిచేవారంటే.. నాలుగో తరగతిలో జరిగిన ఈ ఘటనే ఉదాహరణ అనుకోవచ్చు.

Bill Gates who took cow lung to school when asked to bring something interesting : చాలా ఏళ్ల కిందట..అంటే బిల్ గేట్స్ నాలుగో తరగతి చదువుతున్న సంవత్సరం. ఆయన చదువుతున్న స్కూల్లో టీచర్ ఓ చిన్న టెస్టు పెట్టింది. అదేమిటంటే.. తర్వాత రోజు స్కూలుకు వచ్చేటప్పుడు ఆసక్తికరంగా ఉండేది ఒకటి తీసుకు వచ్చి దాని గురించి పిల్లలకు చెప్పాలని చెప్పింది. టీచర్ చెప్పిన ఆసక్తికరమైనది ఏది అని బిల్ గేట్స్ తీవ్రంగా ఆలోచించాడు. గేట్స్ ఇంతగా ఆలోచించడం చూసిన తండ్రి.. ఓ ఐడియా ఇచ్చాడు అదేమిటంటే.. అందరూ అందరికీ తెలిసినవి తెస్తారు. కాస్త కొత్తగా.. వింతగా .. అందరికీ తెలియాల్సినది తీసుకెళ్లమన్నారు.ఆవు మూత్రపిండాలు తీసుకెళ్లమని సలహా ఇచ్చాడు.
బిల్ గేట్స్ తండ్రి నిజంగా చెప్పాడో.. కామెడీకి చెప్పాడో కానీ గేట్స్ మాత్రం చాలా సీరియస్ గా తీసుకున్నారు. తర్వాత రోజు స్కూల్ కు వెళ్లడానికి ముందే దగ్గరలోని కబేళాకు తండ్రితో సహా వెళ్లాడు . అక్కడ ఆవు మూత్ర పిండాన్ని కొని.. చక్కగా ఓ తెల్లటి వస్త్రంలో కప్పేసుకుని స్కూల్ కు తీసుకు వచ్చారు. అందరూ వారు వారు తీసుకు వచ్చినవి చూపించి వాటి గురించి వివరించారు. బిల్ గేట్స్ ఏమి తీసుకు వచ్చారా అని అందరిలోనూ ఆసక్తి ఉంది. తాను తీసుకు వచ్చిన తెల్లటి వస్త్రాన్ని టేబుల్ మీద పెట్టి విప్పదీశాడు.
అదేమిటో చాలా మందికి తెలియదు. అందరూ నాలుగో క్లాస్ పిల్లలు. అందరికీ అవు మూత్రపిండం గురించి.. దాని పనితీరు గురించి విరవించారు. మనుషుల్లోనూ అలాగే ఉంటుందన్నట్లు చెప్పారు. అది చాలా కొత్తగా ఉంది. అయితే ఈ సమ్ థింగ్ ఇంట్రెస్టింగ్ టీచర్ ను కూడా టెన్షన్ పెట్టింది. బిల్ గేట్స్ కనీసం గ్లౌజులు కూడా పెట్టుకోకుండా.. ఈ ఎక్స్ ప్లెయినర్ చేశారు. కామెడీ ఏమిటంటే.. అది ఆవు మూత్రపిండం అని చెప్పగానే క్లాసులోని ఓ విద్యార్థిని కళ్లు తిరిగి పడిపోయిందట.
Also Read: సిజేరియన్లకు పరుగులు పెడుతున్న ప్రెగ్నెంట్ మహిళలు - పిల్లలకు పౌరసత్వం కోసం అమెరికాలో కొత్త హడావుడి !
బిల్ గేట్స్ ఈ విషయాన్ని ఓ ఇంటర్యూలో చెప్పారు. దాంతో వైరల్ గా మారింది. చదువులో ఊహించనంత ప్రతిభను చూపిన బిల్ గేట్స్.. హార్వార్డ్ లో డిగ్రీ కోసం చేరారు. అయితే రెండేళ్ల పాటు మాత్రమే చదివారు. తనకు ఇక చదువు అవసరం లేదని మైక్రోసాఫ్ట్ ను తన సహచరుడితో కలిసి ప్రారంభించేందుకు వెళ్లిపోయారు. ఆయన విజయప్రస్థానం ప్రపంచ టెక్ .. సాఫ్ట్ వేర్ రంగాన్ని సమూలంగా మార్చేసింది.