Sunita Williams: చూపు మందగించడం, నడక తడబాటు- సునీతా అం‌డ్ టీం ఎదుర్కొనే సమస్యలు ఇవే

Sunita Williams: ISSలో తొమ్మిది నెలలపాటు గడిపిన తర్వాత అమెరికా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమి మీదికి చేరుకున్నారు. ఇప్పుడు ఆ టీం ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలేంటీ?

Continues below advertisement

Sunita Williams: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి సురక్షితంగా వచ్చిన తర్వాత సునీతా విలియమ్స్‌ భావోద్వేగానికి గురయ్యారు. ఇప్పటి వరకు సురక్షితంగా వచ్చిన సునీతా విలియమ్స్‌ అండ్ టీమ్‌ ఇకపై మరింత జాగ్రత్తగా ఉండాలి. సుదీర్ఘకాలం అంతరిక్షంలో ఉన్నందున శారీరకంగా చాలా మార్పులు వచ్చి ఉంటాయి. 

Continues below advertisement

ఎముకలు, కండరాల క్షీణత, రేడియేషన్‌కు గురికావడం, దృష్టి లోపం... అంతరిక్ష ప్రయాణికులు దీర్ఘకాలిక మిషన్లలో ఉన్నప్పుడు ఎదుర్కొనే సమస్యలు. ఒంటరితనం వల్ల కలిగే మానసిక సమస్యలు అదనం.  

అంతరిక్ష పరిశోధనలో నిరంతరం మునిగి తేలే వ్యోమగాములు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అంగారక గ్రహం సహా సౌర వ్యవస్థలోకి డీప్‌గా వెళ్లినప్పుడు ఈ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి.

కేవలం వారం పది రోజుల అంతరిక్షానికి వెళ్లిన విలియమ్స్, విల్మోర్ 9 నెలలకుపైగా అక్కడే ఇరుక్కుపోయారు. అనుకున్న దాని కంటే ఎక్కువ ఉండిపోయినప్పటికీ అందుకు తగ్గట్టుగానే వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి ఉంటారు.  

ISS మిషన్లు సాధారణంగా ఆరు నెలలు ఉంటాయి, కానీ కొంతమంది వ్యోమగాములు ఏడాదికిపైగానే అంతరిక్షంలో ఉంటారు. ఆ వ్యవధిలో వ్యోమగాములు ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటారు.  

బరువులతో ఎక్సర్‌సైజ్‌ చేయడం వల్ల కండరాలు పెరుగుతాయి. ఎముకలు బలపడతాయి. ఇందులో భూమి గురత్వాకర్షణ ఇందుకు ఎంతో సహాయపడుతుంది. అంతరిక్షంలో దీనికి అవకాశం ఉండదు. దీనిని ఎదుర్కోవడానికి వ్యోమగాములు మూడు ఎక్సర్‌సైజ్‌ మెషిన్స్ ఉపయోగిస్తారు. వీటిలో 2009లో ఇన్‌స్టాల్ చేసిన  రెసిట్సెన్సీ డివైస్‌. ఇది వాక్యూమ్ ట్యూబ్‌లు. ఫ్లైవీల్ కేబుల్‌లు ఉపయోగిస్తారు.  

రోజుకు రెండు గంటల పాటు వ్యాయామం చేస్తే ఆరోగ్యంలో మార్పులు రాకుండా చూసుకోవచ్చు. అంతరిక్షం నుంచి వచ్చిన వాళ్లను గమనిస్తే ఎలాంటి సమస్య ఉన్నట్టు కనిపించదు. కానీ పరీక్షల్లో వాళ్ల ఎముకల్లో సమస్యలు ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. 

తడబాటు వ్యామోగాములు ఎదుర్కొనే సమస్యల్లో మరొకటి. ఇది ప్రతి వ్యోమగామికి ఎదురయ్యే అనుభవం. ఎన్ని రోజులకు వెళ్లినా ఈ సమస్య తప్పదని నిపుణులు చెబుతున్నారు. అంతరిక్షం నుంచి వచ్చిన వారి వినికిడి శక్తిని పెంపొందించేదుకు ప్రయత్నిస్తారు.  

ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటారని ముందే గ్రహించిన నాసా తిరిగి వచ్చిన వ్యోమోగాములకు ప్రత్యేక శిక్షణ ఇస్తుంది. 45 రోజులపాటు ఇచ్చే పునరావాస శిక్షణకు  వ్యోమగాములు కచ్చితంగా హాజరుకావాల్సి ఉంది.  

"ఫ్లూయెడ్స్ షిప్ట్‌" - మైక్రోగ్రావిటీలో శరీర ద్రవాలు భిన్నంగా మారుతూ ఉంటాయి. ఇది మూత్రంలో కాల్షియం స్థాయిలను పెంచుతుంది. ఫలితంగా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. 

"ఫ్లూయెడ్స్ షిప్ట్‌" వల్ల ఇంట్రాక్రానియల్ ఒత్తిడి పెరుగుతుంది. ఐబాల్ ఆకారాన్ని మారిపోయే ఛాన్స్ ఉంటుంది. స్పేస్‌ఫ్లైట్ అసోసియేటెడ్‌ న్యూరో ఓక్యులర్ సిండ్రోమ్ (SANS)కు అవకాశం ఉంది. దీనివల్ల స్వల్ప దృష్టి లోపం ఏర్పడుతుంది. కార్బన్

డయాక్సైడ్ స్థాయిలు కూడా పెరుగుతుంది. వీటన్నింటిలో SANS తీవ్రమైనదిగా చెబుతున్నారు గతంలో వెళ్లి వచ్చిన వ్యోమగాములు. 

ISS వాన్ అల్లెన్ రేడియేషన్ బెల్ట్ గుండా వెళుతున్నందున, దానిపై రేడియేషన్ స్థాయిలు నేలపై కంటే ఎక్కువగా ఉంటాయి. క్యాప్సూల్స్‌లో ఉన్న షీల్డింగ్ చాలా ముఖ్యమైనది. NASA వ్యోమగాములకు క్యాన్సర్ ప్రమాదం నుంచి కాపాడుతుంది. ఈ ప్రమాదాన్ని మూడు శాతానికి పరిమితం చేయనుంది. 

Continues below advertisement