EarthQuake: నేపాల్‌-టిబెట్ సరిహద్దుల్లో సంభవించిన భూకంపం( EarthQuake)లో 53 మంది కన్నుమూశారు. ఈ ఉదయం సంభవించిన భూకంపం తర్వాత టిబెట్‌(Tibet)లోని షిగాట్సే నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో కనీసం 53 మంది చనిపోయినట్లు చైనా మీడియా వెల్లడించింది..


కంపించిన భూమి
నేపాల్‌-టిబెట్‌  సరిహద్దుల్లో సంభవించిన భారీ భూకంపం దాటికి పరిసర ప్రాంతాలు వణికిపోయాయి. జనం భయంతో ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు  53 మంది చనిపోగా..తీవ్రంగా గాయపడిన మరో 62 మందిని రక్షణ బలగాలు ఆస్పత్రికి  తరలించాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. కొన్నిచోట్ల కొండ చరియలు  విరిగి పడగా....ఇళ్లు కూలిపోయాయి. శిథిలాల తొలగింపు  కొనసాగుతోంది. రిక్టర్‌ స్కేలుపై భూకంపం తీవ్రత  6.8 గా నమోదైంది. టిబెట్‌తోపాటు సమీపంలోనే నేపాల్‌, భారత్‌లోని ఢిల్లీ(Delhi) పరిసర ప్రాంతాల్లోనూ కొద్ది క్షణాల పాటు భూమి కంపించింది.నేపాల్‌-టిబెట్‌ (Nepal-Tibet Border) సరిహద్దుకు దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిజాంగ్ అటానమస్‌ రీజియన్  ప్రాంతంలో భూకంపం  సంభవించగా...టిబెట్‌లోని షిజాంగ్‌లో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. చైనా ఎర్త్‌క్వేక్ నెట్‌వర్క్ సెంటర్ ప్రకారం గత ఐదేళ్లలో 200 కిలోమీటర్ల  పరిధిలో ఈస్థాయిలో భూకంపం ఎప్పుడూ రాలేదని...ఈరోజు ఉదయం సంభవించిన భూకంపమే అతిపెద్దదని తేల్చింది.