AI powered humanoid robots: AI: ఆధారిత హ్యూమనాయిడ్ రోబోట్‌లను అభివృద్ధి చేయడానికి ఆపిల్, మెటా పని చేస్తున్నాయి. వీరు రెడీ చేయబోతే రోబోలు బట్టలు ఉతకడం, ఇస్త్రీ చేయడం కూడా చేస్తాయట. మెటా తన AI హ్యూమనాయిడ్ రోబోట్‌ను అభివృద్ధి చేయడానికి దాని రియాలిటీ ల్యాబ్స్ హార్డ్‌వేర్ విభాగంలో పూర్తిగా కొత్త విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఆపిల్ దీని కోసం కొంచెం భిన్నమైన విధానాన్ని తీసుకుంది. హ్యూమనాయిడ్ రోబోట్‌ను ఆపిల్ సంస్థ మెషిన్ లెర్నింగ్ గ్రూప్ అభివృద్ధి చేస్తోంది.
ఏఐ రోబోలపై భారీగా పెట్టుబడి పెడుతున్న యాపిల్, మెటా
ఆపిల్, మెటా సిద్ధం చేస్తున్న AI హ్యూమనాయిడ్ రోబోలు బట్టలు ఉతకడం, ఇస్త్రీ చేయడంతో పాటు వంట పనులు కూడా చేస్తాయని చెబుతున్నారు. ఇంతకు ముందే టెస్లా చీఫ్ మాస్క్ వి.రోబో పేరుతో రోబోలను ఆవిష్కరించారు. అయితే ఎలాన మస్క్ సిద్దం చేసిన రోబో కంటే మెరుగ్గా మరింత వేగంగా మెటా, హార్డ్‌వేర్ డెవలపర్లు AI హ్యూమనాయిడ్ రోబోను సిద్ధం చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. రియాలిటీ సెన్సార్లు, కంప్యూటింగ్ , లామా AI మోడల్ సిద్ధం చేస్తున్న ఏఐ రోబో అత్యుత్తమంగా ఉంటుందని మెటా భావిస్తోంది. ఈ హ్యూమనాయిడ్ రోబోట్‌ల అభివృద్ధి కోసం చైనా భాగస్వామ్యాన్ని మెటా తీసుకుంటోంది. చైనాకు చెందిన యూనిటరీ రోబోటిక్స్, ఫిగర్ AI అనే సంస్థలతో కలిసి పని చేస్తోంది. ఫిగర్ AI కంపెనీ టెస్లా రోబోలకు పోటీదారుగా ఉంటుందన్న ప్రచారం ఉంది.
గూగుల్ కూడా అదే పనిలో !
ఆపిల్ కూడా సొంత హ్యూమనాయిడ్ రోబోట్‌పై పనిచేస్తున్నట్లుగా నివేదికలు వెల్లడిస్తున్నాయి. యాపిల్ రోబోట్‌లను ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీతో రూపొందిస్తున్నారు. ఈ ప్రాజెక్టును యాపిల్ ఏఐ టీమ్స్ చేపట్టాయి. AI హ్యూమనాయిడ్ రోబోట్‌లపై భారీగా పెట్టుబడులు పెడుతున్నది మెటా , ఆపిల్ మాత్రమే కాదు., గూగుల్ కూడా అదే పనిలో ఉంది. గూగుల్ కు చెందిన డీప్‌మైండ్ కూడా రోబోటిక్‌లపై పరిశోధనలు చేస్తోంది. టెక్సాస్‌కు చెందిన అప్ట్రోనిక్ అనే కంపెనీ $350 మిలియన్ల పెట్టుబడిని గూగుల్ నుంచి అందుకుంది. అప్ట్రోనిక్ టెస్లాకు పోటీదారుగా ఉంది. ఈ కంపెనీ వివిధ రంగాలలో హ్యూమనాయిడ్ రోబోట్‌లను ప్రవేశ పెట్టేందుకు అవసరమైన పరిశోధనలు చేస్తోంది.
వచ్చే ఐదేళ్లలో మార్కెట్ పై దండెత్తనున్న రోబోలు
AI హ్యూమనాయిడ్ రోబోట్‌లు గేమ్ ఛేంజర్ గా ఉంటాయని భావిస్తున్నాయి. వ్యక్తిగత జీవితంతో పాటు పారిశ్రామక,సేవల రంగాల్లో ఇవి చేయబోయే పనులు సంచలనంగా మారబోతున్నాయి. ఆరోగ్య సంరక్షణ, విద్య వంటి రంగాల్లో విప్లవాత్మక మార్పులు ఈ ఏఐ రోబోలు తెస్తాయని చెబుతున్నారు. ఇంట్లో రోజువారీ పనులలో మనుషులకు కూడాడ కూడా సహాయపడతాయి. వచ్చే నాలుగైదేళ్లలో ఈ హ్యూమనాయిడ్ రోబోట్‌లు మార్కెట్ పై దండెత్తడం ఖాయంగా కనిపిస్తోంది.