Christmas Tree History: క్రిస్మస్‌ అంటే ఆ సందడే వేరు. ప్రపంచమంతా ఆ సంబరాలే వేరుగా ఉంటాయి. డిసెంబర్‌ 25వ తేదీ వచ్చిదంటే చాలు.. అమెరికా టూ అమలాపురం వరకు ఎటు చూసినా క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ సందడి మొదలవుతుంది. వీథులన్నీ కలర్‌ఫుల్‌ లైటింగ్స్‌తో దేదీప్యమానంగా వెలిగిపోతాయి. అందంగా అలంకరించిన క్రిస్మస్‌ ట్రీతో పాటు రంగురంగుల విద్యుద్దీపాలు, అందుకనుగుణంగా సెట్‌ చేసిన మ్యూజిక్‌ను ఆస్వాదిస్తూ ఎంజాయ్‌ చేస్తారు. అయితే ప్రతి ఏడాది క్రిస్మస్‌ పండుగను పురస్కరించుకుని ప్రతి ఇంట్లో కానీ చర్చ్‌లల్లో క్రిస్మస్‌ చెట్లను ఎందుకు పెడుతారో మీకు తెలుసా.? క్రీస్తు పుట్టిన రోజునే క్రిస్టమస్‌ ట్రీని పెట్టడానికి సంబంధం ఏమిటో తెలుసా..? 


క్రిస్మస్ ట్రీ సంప్రదాయం మధ్యయుగంలో జర్మనీలో ఆరంభమైందని చరిత్ర చెబుతుంది. 15వ శతాబ్ధంలో లివోనియాలో మొదట క్రిస్మస్‌ చెట్టును అలంకరించడం అనే సంప్రదాయం మొదలయ్యింది అని చెప్తుంటారు. చారిత్రకంగా క్రిస్మస్‌ చెట్టుని పరిశీలిస్తే ఈ సంప్రదాయం 1781లో బెన్షివిక్‌ సైనికుల ద్వారా కెనడాలోకి ప్రవేశించింది అని అంటారు. అయితే అప్పట్లో సరివి చెట్ల కొమ్మలు తెచ్చి, దాన్ని క్రిస్మస్ ట్రీలా అలంకరించేవారు. కానీ ఇప్పుడు కేవలం ప్లాస్టిక్‌ చెట్లు మాత్రమే.. అందుబాటులో ఉంటున్నాయి. ఇదిలా ఉంటే నస్సావో - విల్‌బర్గ్‌ యువరాణి హెన్‌రేటా క్రిస్మస్‌ చెట్టుని వియన్నా దేశానికి పరిచయం చేసిందట. ఆ తర్వాత ఈ కల్చర్‌ ఆస్ట్రియారకి చేసిందట. ఇక ఫ్రాన్స్‌ దేశంలోకి 1840డచ్‌ వారి ద్వారా ఈ చెట్టు వచ్చిందని కూడా అంటారు. ఆ తర్వాత విక్టోరియా రాణి తన రాజ్య భవనంలో క్రిస్మస్‌ రోజునా.. ఈ చెట్టును ఏర్పాటు చేయడంతో అది అత్యధికంగా ప్రాచుర్యం పొంది, క్రైస్తవులందరి ఇళ్లలోని ఈ చెట్టు చేరిందని చెబుతుంటారు. అంతేకాదు.. సంస్కరణోద్యమ పితామహుడు మార్టిన్ లూథర్ మొదటగా ఈ చెట్టుకు దీపాలు పెట్టి అలంకరించారని, అప్పటి నుండి క్రిస్మస్ చెట్టును పళ్లు, కానుకలతోనే కాక దీపాలతో కూడా అలంకరిస్తున్నారన్న టాక్‌ కూడా ఉంది. 


ఇదిలా ఉంటే.. క్రిస్మస్‌ చెట్టుకు సంబంధించిన ఇంకో రకమైన హిస్టరీ ప్రాచూర్యంలో ఉంది. 18వ శతబ్దంలో వాలంటైన్‌, మేరీ అనే ఇద్దరు అన్నచెల్లెలు భయంకరంగా కురుస్తున్న మంచులో కూరుకుపోయిన ఓ చిన్న ఇంట్లో ఆకలితో వణుకుతుంటారు. తన పిల్లలు ఆకలితో ఉండటం చూసిన, ఆ పిల్లల తండ్రి ఓ రొట్టె ముక్కను వాళ్లకు ఇస్తాడు. ఇక ఏసుప్రభును ప్రార్థించిన తర్వాత ఆ రొట్టె ముక్కను తినేందుకు సిద్ధమైన వాలంటైన్‌, మెరీలకు చలిలో వణుకుతూ, వాళ్ల ఇంటి ముందు పడుకుని ఉన్న ఓ బాలుడిని చూస్తారు. ఆ బాలుడిని చూసి చలింపోయిన ఆ అన్నచెల్లెలు ఆ బాలుడిని ఇంట్లోకి తీసుకు వచ్చి, తీవ్ర ఆకలితో ఉన్న ఆ బాలుడికి తమ వద్ద ఉన్న ఒక్క రొట్టెను ఆ బాలుడికి ఇస్తారు. ఇక ఆ రొట్టెను తిన్న బాలుడు మెళ్లిగా నిద్రలోకి జారుకున్నాడు. పాపం బాలుడి ఆకలి తీర్చామన్న ఆనందంలో వాళ్లు ఆకలిని దిగమింగుకుని, పడుకున్నారు ఆ అన్నచెల్లెల్లు. గాడ నిద్రలో నుంచి ఒక్కసారిగా నిద్రలేచిన వాలంటైన్‌, మేరీలకు ఆకాశంలో తలతలమెరుస్తున్న నక్షత్రాలతో పాటు దేవదూతలు ఆకాశంలో విహరిస్తూ కనిపించారు. కానీ వాళ్లిద్దరికీ ఆ క్షణం ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఇంతలోనే అప్పటి వరకు పడుకుని ఉన్న ఆ బాలుడు నవ్వుతూ పైకి లేచి, ఆకర్షనీయమైన దుస్తువులు ధరించి, తలపై కిరీటం పెట్టుకుని ప్రకాశవంతంగా కనిపించాడు. "నేను బాల ఏసయ్యను.. ఆకాలిగా ఉందని చెప్పగానే నాకు రొట్టె ఇచ్చారు. 
మీ వద్ద ఒకే రొట్టె ముక్క ఉన్న.. అది కూడా నాకే ఇచ్చారు. అందుకు చాలా ధన్యవాదాలు. పరలోకంలో ఉన్న ఏసయ్య మిమ్మల్నీ చల్లగా ఉంచుతారు. ఆయన ఆశీస్సులు ఎప్పుడు మీకు ఉంటాయని అన్నారు. మిమ్మల్నీ ఎప్పుడూ మంచిగా ఉంచుతారంటూ తెలిపారు. ఆ తర్వాత ఓ ఎండిపోయిన ఓ చెట్టు కొమ్మను తుంచి వాలంటైన్‌, మేరీ ఇంటి ముందు పాతాడు ఆ బాల ఏసయ్య. ఇక కాసేపటికే ఆ చెట్టు ఎంతో పచ్చగా చిగురించి చాలా పెద్దగా అవుతునే, ఎన్నో రకాల గిఫ్ట్‌లు ఆ చెట్టు కొమ్మకు ఉన్నాయి. అంతేకాదు.. బంగారం ఆకులతో మిలమిల మెరుస్తూ.. కనిపించింది. అందుకోసమే.. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఏడాది క్రిస్మస్‌ రోజునా.. చెట్టును ఇంటి ముందు ఉంచడం ఆనవాయితిగా వచ్చిన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. క్రిస్మస్‌కు ప్రారంభం ముందు నుంచే క్రైస్తవులు తమ ఇళ్లపై నక్షత్ర ఆకృతులను అలంకరించుకునేందుకు కూడా హిస్టరీ ఉన్నట్లు తెలుస్తోంది. తూర్పు దేశాల వారికి దారి చూపిన దివ్య నక్షత్రాన్ని క్రీస్తు జయంతి సందర్భంగా ప్రత్యేక చిహ్నంగా భావిస్తారు. అందుకు క్రీస్తు రాకను కాంక్షిస్తూ క్రైస్తవ ప్రార్థనా మందిరాలు, ఇళ్లపై అలంకరించడం ఒక సంప్రదాయంగా నేటికీ కొనసాగుతుంది.