లేని దాని కోసం.. రాని దాని కోసం ఆరాటపడితే మొదటికే మోసం వస్తుంది. అప్పులు తత్వం బోధపడినా  జరిగిన నష్టాన్ని భరించడం కష్టం. ఈ విషయం ఇంగ్లాండ్‌కు పీట్‌ అనే పెద్దాయనకు ఆలస్యంగా తెలిసింది. ఇప్పుడు ఆయన ఏం చేయాలో తెలియక కిందా మీదా పడుతున్నారు. కంటి మీద కునుకు లేకుండా బతుకుతున్నాడు. కను రెప్పలు కూడా మూయలేకపోతున్నాడు.  నిజంగానే కను రెప్పలు కూడా మూయలేపోతున్నాడు. ఇలా ఎందుకు జరిగిందో తెలుసుకోవాలంటే ఆయన కథను మొదటి నుంచి తెలుసుకోవాల్సిందే. 


లండన్‌కు చెందిన పిట్‌కు70 ఏళ్లు నిండిపోయాయి. అయితే ఆయన తన భార్యను ఇంప్రెస్ చేయాలని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా పాడైన తన పళ్లకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడు. ఆయన ఏం చెప్పాడో.. డాక్టర్లు ఏం సర్జరీ చేశారో కానీ ఆయన పళ్లు మరింత దారుణంగా .. అసహ్యంగా తయారయ్యాయి. ఆ పళ్లను చూసి ఆయన భార్య కూడా కలిసి ఉండలేనని చెప్పి వెళ్లిపోయింది. ఏదో చేద్దమనుకుంటే మొత్తానికే కోల్పోయిన పరిస్థితి రావడంతో వెంటనే.. తప్పు దిద్దుకోవాలనుకున్నాడు.


ఎవరైనా తప్పు దిద్దుకోవాలనుకుంటే పళ్లను యథతథంగా చేసే ఆపరేషన్ చేయించుకుంటారు. కానీ పిట్ జాతకం బాగోలేదేమో కానీ.. బిన్నమైన వచ్చింది. .అసలు మొహం మొత్తం యంగ్‌గా మార్పించుకోవాలని డిసైడ్ ప్లాస్టిక్ సర్జరీ చేయించేసుకున్నారు. సినిమాల్లో చూపించినట్లుగా మొహంపై కట్లు విప్పగానే.. తనో బ్రాడ్ పిట్‌గానో.. ఆర్నాల్డ్ లాగో కనిపిస్తానని అనుకున్నాడు. కానీ "ఐ" సినిమాలో విక్రమ్‌లా మారిపోయాడు. దీంతో ఇప్పుడు ఆయన భార్యను వెనక్కి తెచ్చుకునే ఆశలు వదిలేశారు. ఇప్పుడు ఎలా సుఖంగా బతకాలా అని ఆలోచిస్తున్నాడు. 


కనీసం ఒంటరిగా అయినా ప్రశాంతంగా బతుకుందామంటే అదీ సాధ్యం కావడం లేదు. ఎందుకంటే ప్లాస్టిక్ సర్జరీ కారణంగా కనురెప్పలు కదలడం మానేశాయి. కళ్లు మూతపడటం లేదు. దీతో దుమ్ము తరచూ కంట్లో పడుతోంది. రోజకు ఎనిమిది సార్లు డ్రాప్స్ వేసుకోవాల్సి వస్తోంది. నిద్రపోయేటప్పుడు కళ్లు తెరిచే నిద్రపోవాల్సి వస్తోంది. కళ్లకు గంతలు కట్టుకుని పడుకుంటున్నాడు. ఇప్పుడు ఆయన బార్యను ఎలా వెనక్కి తీసుకు రావాలా అని ఆలోచించడం లేదు... తన కష్టాలను ఎలా పరిష్కరించుకోవాలా అని మథనపడుతున్నారు. ఓ సమస్య పరిష్కారం కోసం మరో సమస్యను తెచ్చి పెట్టుకుని పిట్ ఇప్పుడు నానా ఇబ్బందులు పడుతున్నాడు.  ఇప్పుడీ పిట్ వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది.   ప్లాస్టిక్ సర్జరీ అనేది దుర్వినియోగం చేయకూడదని పిట్ లాంటి వారి అనుభవాలతో తెలిసిపోతుదంని కామెంట్లు వినిపిస్తున్నాయి.