Woman Dragged Into River By Crocodile While Bathing: ఒడిశా జాజ్‌పూర్ జిల్లాలోని బింఝార్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కన్తీయా గ్రామంలో 57 ఏళ్ల మహిళ సౌదామిని మహలా స్నానం చేసేందుకు నదిలోగి దిగారు. ఆకస్మికంగా మొసలి ఆమెపై దాడి చేసి నోట కరుచుకుని తీసుకెళ్లిపోయింది. ఈ భయానక దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సోమవారం మధ్యాహ్నం సుమారు 4 గంటల సమయంలో ఖరస్రోటా నది ఒడ్డున స్నానం చేస్తుండగా, ఆకస్మికంగా మొసలి దాడి చేసింది. సౌదామిని మహలాను దాడి చేసింది. బోడువా గ్రామానికి చెందిన ఆమె నది లో స్నానం చేస్తోంది. మొసలి ఆమెను నది లోతుల్లోకి లాగి తీసుకెళ్లింది. గ్రామస్తులు ఆ దృశ్యాన్ని చూసి షాక్ అయ్యారు. బ్రిడ్జ్ మీదున్నవారు కేకలు వేస్తూ సహాయం చేయడానికి ప్రయత్నించారు, కానీ మొసలి దగ్గరకు వెళ్లలేకపోయారు.
గ్రామస్తులు వెంటనే పోలీసులు, ఫైర్ సర్వీసెస్‌కు సమాచారం అందించారు. ఘటన జరిగిన వెంటనే టీమ్ స్పాట్‌కు చేరుకుంది. సెర్చ్ ఆపరేషన్‌ను ప్రారంభించాం. మొసళ్లు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామస్తులకు హెచ్చరికలు జారీ చేశామని పోలీసులు చెబుతున్నారు.
ఘటన సమయంలో షూట్ అయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 49 సెకన్ల దృశ్యాల్లో మొసలి మహిళను గట్టిగా పట్టుకుని నది డౌన్‌స్ట్రీమ్‌లోకి లాగి తీసుకెళ్తుండటం కనిపిస్తోంది. పొరుగు బ్రిడ్జ్ మీదున్న గ్రామస్తులు "సేవ్ హెర్" అంటూ కేకలు వేస్తున్నారు, కానీ ఎవరూ రక్షించలేకపోయారు. మహిళ ఆచూకీని కూడా కనిపెట్టలేకపోయారు.
జాజ్‌పూర్ జిల్లా మొసళ్లు ఎక్కువగా ఉండే ప్రాంతం. భీతర్‌కనికా వైల్డ్‌లైఫ్ సాంక్చురీ (672 చ.కి.మీ.)లో రెండు వేల వరకూ ఉంటాయి. ఇది దేశంలో అత్యధికం. ఖరస్రోటా, బైతరాని, మహానది ప్రాంతాల్లో ఎక్కువగా సంచరిస్తున్నాయి. కొన్ని నెలల క్రితం ఇదే ప్రదేశంలో ఒక మేకను లాగి తీసుకెళ్లింది. బ్రీడింగ్ సీజన్‌లో మరింత ఎక్కువగా మొసళ్లు దాడి చేస్తాయని వైల్డ్‌లైఫ్ ఎక్స్‌పర్టులు చెబుతున్నారు.