Himachal CM Sukhu: 


ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేస్తాం: సుఖ్వీందర్ 


ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ప్రతిహామీని నెరవేర్చి తీరుతామని హిమాచల్ ప్రదేశ్ కొత్త సీఎం సుఖ్వీందర్ సింగ్ సుకు వెల్లడించారు. కాంగ్రెస్ మొత్తం 10 హామీలు ఇచ్చిందని...వాటిలో అత్యంత కీలకమైన ఓల్డ్ పెన్షన్ స్కీమ్‌ (OPS)ను తప్పక అమలు చేస్తామని హామీ ఇచ్చారు. "మొత్తం 10 హామీలిచ్చాం. అవన్నీ అమలు చేసి తీరతాం. పారదర్శకత, నిజాయతీతో కూడిన పరిపాలన అందిస్తాం. మొట్టమొదటి కేబినెట్ మీటింగ్‌లోనే ఓల్డ్ పెన్షన్ స్కీమ్‌ అమలుపై నిర్ణయం తీసుకుంటాం" అని స్పష్టం చేశారు. ఇవి కాకుండా కాంగ్రెస్ మరి కొన్ని కీలక హామీలు ఇచ్చింది. ప్రతి ఇంటికీ 300 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అందిస్తామని చెప్పింది. 18 ఏళ్లు పైబడిన మహిళలందరికీ నెలకు రూ.1,500 నగదు బదిలీ చేస్తామని హామీ ఇచ్చింది. మొబైల్ క్లినిక్స్ ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో పేదలకు ఉచిత వైద్యం అందిస్తామని వెల్లడించింది. 










సచిన్ పైలట్‌కు కలిసొచ్చింది..


హిమాచల్‌లో కాంగ్రెస్‌కు సచిన్ పైలట్ స్టార్ క్యాంపెయినర్‌గా వ్యవహరించారు. ఎన్నికల వ్యూహాలు రచించడంలోనూ పైలట్ కీలక పాత్ర పోషించారు. ప్రియాంక గాంధీ కూడా ఆయనకు అండగా నిలిచారు.  తనదైన వ్యూహాలతో పార్టీని విజయ తీరాలకు చేర్చారు. ఈ గెలుపుతో... కాంగ్రెస్ అధిష్ఠానం సచిన్ పైలట్‌కు ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు చాలానే ఉన్నాయి. ఇదే జరిగితే...అశోక్ గహ్లోట్ పదవికి ఎసరు తప్పదు. అంతర్గత కలహాలతో రాజస్థాన్‌లోనూ అధికారాన్ని కోల్పోవడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదు. ఇలా జరగకుండా ఉండాలంటే...సచిన్‌ పైలట్‌ను రంగంలోకి దింపి, ఆయనకే రాష్ట్ర పగ్గాలు అప్పజెప్పాలని అధిష్ఠానం భావిస్తుండొచ్చు. ఎలాగో...హిమాచల్ ఎన్నికలతో పైలట్ రిపోర్ట్‌ కార్డ్‌ వచ్చేసింది. ఈ పరిమామాలతో...గహ్లోట్ పొలిటికల్ ఇమేజ్ దెబ్బ తినేందుకు ఆస్కారముంటుంది. రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో ఉన్న విభేదాలకు "సరైన పరిష్కారం" దొరుకుతుందన్న నమ్మకముందని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అన్నారు.  "రాజస్థాన్‌లో మళ్లీ కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని, పార్టీలోని అంతర్గత విభేదాలకు స్నేహపూర్వక పరిష్కారం లభిస్తుందని నమ్ముతున్నాను" ఆశాభావం వ్యక్తం చేశారు. 
ఓ టీవీ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోట్..సచిన్‌ పైలట్‌పై విరుచుకు పడ్డారు. "మోసగాడు" అంటూ పదేపదే పైలట్‌ను ఉద్దేశిస్తూ తీవ్రంగా మండి పడ్డారు. "ఓ మోసగాడు ఎప్పటికీ ముఖ్యమంత్రి అవ్వలేడు" అని నిప్పులు చెరిగారు. 


Also Read: Twitter Blue: ట్విట్టర్ బ్లూ మళ్లీ వస్తోంది - యాపిల్ వినియోగదారులు ఎక్కువ సమర్పించాల్సిందే!