Bengaluru man confronts non Kannada speaker: గ్లోబల్ సిటీగా మారిన బెంగళూరులో భాషా పరమైన వివక్ష పెరుగుతూ వస్తోంది. ఇటీవల కన్నడ నేర్చుకున్న వాళ్లు మాత్రమే బెంగళూరులో ఉండాలంటూ కొంత మంది చేసిన వివాదం  కలకలం  రేపింది. తాజాగా అలాంటిదే మరో వీడియో వైరల్ అయింది. పెన్నెండేళ్లుగా బెంగళూరులో ఉంటున్న ఓ వ్యక్తితో కన్నడ వచ్చిన మరో వ్యక్తి వాగ్వాదానికి  దిగారు. పన్నెండేళ్లుగా ఉంటున్నా ఎందుకు స్థానిక భాష నేర్చుకోలేదని ఆయన ఎదుటి వ్యక్తిని నిలదీశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  



తాను ఆరు నెలల కిందట బెంగళూరుకు షిఫ్ట్ అయ్యానని తనకు బెంగళూరులో భద్రత ఉందా అని ఓ వ్యక్తి ప్రశ్నించారు. దానికి ట్వీట్ చేసిన మంజు అనే వ్యక్తి కన్నడ నేర్చుకోవాలని ఉచిత కన్నడ నేర్పించే వెబ్ సైట్ పేరును సజెస్ట్ చేశాడు. 





ఈ వీడియోపై  నెటిజన్లు బిన్నంగా స్పందిస్తున్నారు. ఇండియా ఆఫ్ఘనిస్తాన్ కాదని ఓ భాష నేర్చుకోవాలని ఎవరూ డిక్టేట్ చేయలేరని ఓ నెటిజన్ స్పందించారు.  



కొంత మంది లోకల్ లాంగ్వేజ్ నేర్చకోవడం వల్ల మంచే జరుగుతుందని సలహా ఇచ్చారు. [ 



భాష నేర్చుకోవడానికి ఇబ్బంది లేదు కానీ.. మోరల్ పోలీసింగ్ చేయడాన్ని మాత్రం ఎవరూ అంగీకరించబోరని మరో నెటిజన్ సమాధానమిచ్చారు.   



మొత్తంగా బెంగళూరులో కన్నడిగుల బాషాభిమానం.. ఇలా మోరల్ పోలీసింగ్ చేసే స్థాయికి వెళ్లడం ఉద్యోగాల కోసం వచ్చిన  వారిని ఆందోళనకు గురి చేసేలా మారుతోంది.