Who is the Amul girl Brand breaks silence:  భారతదేశ ప్రకటనల రంగంలో అమూల్ బేబీ ఓ సంచలనం. ఇప్పటికీ ఆ బేబీ ఫోటోనే అమూల్ ఉపయోగిస్తూ ఉంటుంది. ఇంతకీ ఆ బేబీ ఎవరు అన్నదానిపై రకరకాల ప్రచారాలు జరుగుతూ ఉంటాయి. ఇటీవల ఆ బేబీ శశిధరూర్ సోదరి అనే ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. శోభా థరూర్ ట్విట్టర్‌లో కూడా స్పందించారు.   తానే  మొదటి అమూల్ బేబీనని.. శ్యామ్ బెనెగల్ ఫోటోలు తీశారని ప్రకటించుకున్నారు.  నా సోదరి స్మితా థరూర్ రెండవ కలర్ క్యాంపెయిన్‌లో ఉన్నారు. " అని ట్వీట్ చేశారు . ఈ ప్రచారంపై అమూల్ కంపెనీ స్పందించింది. 

అమూల్ గర్ల్ ఇలస్ట్రేషన్ శోభా థరూర్ నుంచి ప్రేరణ పొందలేదని స్పష్టం చేసింది.   1966లో  అమూల్ ఛైర్మన్ డాక్టర్ వెర్ఘీస్ కురియన్ ఆధ్వర్యంలో, సిల్వెస్టర్ డాకున్హా ,  యుస్టేస్ ఫెర్నాండెస్ ఈ చిన్నారి చిత్రాన్ని  రూపొందించారు.,  ఇది పోల్సన్ బటర్ గర్ల్‌కు పోటీగా సిద్ధం చేశారు.   ఈ బ్లూ-హెయిర్డ్, పోల్కా-డాటెడ్ డ్రెస్ ధరించిన  చిన్నారి ఫోటో భారతీయ సంస్కృతిలో ఒక ఐకాన్‌గా మారింది.  దశాబ్దాలుగా సామాజిక, రాజకీయ, క్రీడా సంఘటనలపై తన సెటైరిక్  వ్యాఖ్యానాలతో ప్రజలను ఆకర్షిస్తోంది.  

 శోభా థరూర్ శ్రీనివాసన్, ఇప్పుడు కాలిఫోర్నియాలో పిల్లల కథా రచయిత్రిగా ఉన్నారు. శశిథరూర్ కు ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. వారిద్దరూ అమూల్‌కు ప్రకటనల్లో నటించారు. శశి థరూర్ కూడా 2016లో ఒక ఆర్టికల్‌లో తన సోదరీమణులు అమూల్ బేబీలుగా నటించిన విషయాన్ని పేర్కొన్నారు. ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత  అమూల్ కార్టూన్ యాడ్‌లో ఆయన కూడా కనిపించారు.  

1966లో సృష్టించి  అమూల్ గర్ల్, భారతదేశంలో వైట్ రెవల్యూషన్‌కు నాంది పలికిన డాక్టర్ వెర్ఘీస్ కురియన్ ఆలోచనలతో రూపొందింది. ఈ పాత్ర అమూల్ బటర్‌ను ప్రమోట్ చేయడమే కాకుండా ఇప్పటికీ అందరి దృష్టిని ఆకర్షిస్తూనే ఉంది. దశాబ్దాలుగా, అమూల్ గర్ల్ బిల్‌బోర్డ్‌లు భారతీయ సంస్కృతిలో ఒక భాగంగా నిలిచాయి. అయితే ఆ గర్ల్ మాత్రం.. కల్పితమని.. శశిథరూర్ .. సోదరీమణులు కాదని అమూల్ క్లారిటీ ఇచ్చినట్లయింది.