Who Invented Homework?:  హోమ్ వర్క్ అనే మాట వింటేనే ఎవరికైనా కంపరం ఎత్తుతుంది. వర్క్ ఫ్రం హోం అయితే ఉద్యోగులు పండగ చేసుకుంటారేమో కానీ విద్యార్థులు మాత్రం హోమ్ వర్క్ అంటే  రగిలిపోతారు. అంత సేపు స్కూల్లో కూర్చుని పాఠాలు విని రావడమే కాకుండా  మళ్లీ ఇంటికి వచ్చి అదే పని చేసుకోవడం  విద్యార్థులకు నరకమే. అందుకే ఈ హోమ్ వర్క్ కనిపెట్టిన వాడు ఎవడబ్బా ? అని అప్పుడప్పుడూ అనుకూంటూ ఉంటారు. కానీ ఎవరో చాలా మందికి తెలియదు. 


అయితే కొన్ని పరిశోధనల ప్రకారం హోమ్‌ వర్క్ ఎవరు కనిపెట్టారో అంచనా వేసుకోవచ్చు. ఓ అంచనా ప్రకారం ఇటలీలోని వెనిస్‌కు చెందిన రాబర్టో నెవిల్లీస్ అనే టీచర్  హోమ్‌వర్క్‌ అనే విధానాన్ని ప్రారంభించారని చెబుతూంటారు. ఆయన సరిగ్గా చదవని విద్యార్థులకు ఈ పనిష్మెంట్ ఇచ్చేవాడట. అయితే ఇది ఇప్పుడు కాదు ఒక వెయ్యేళ్ల కిందట అంటే.. 1095లో అట.  అందుకే దీనికి సంబందించి విశేషాలు తెలుసుకాని సాక్ష్యాలు అయితే లేవు. అందుకే  రాబర్టో నెవిల్లీస్ ను బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద వదిలి వేయవచ్చు. 


అయితే  హోమ్ వర్క్ అనే దాన్ని నిజంగా ప్రారంభించినట్లుగా ఆధారాలున్న మహనీయుడు మాత్రం జాన్ అమెస్ కొమెనియస్. ఈయనను ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఎడ్యుకేషన్‌గా కూడా పిలుస్తూంటారు. ఆధునిక చదువులో వచ్చిన అనేక మార్పులు జాన్ అమోస్ చలువేనని విద్యానిపుణులు చెబుతూ ఉంటారు. క్లాసులు దగ్గర్నుంచి కొత్త కొత్త టీచింగ్ పద్దతుల వరకూ జాన్ అమెస్ ప్రారంభించారు. అందులో హోమ్ వర్క్ కూడా ఉంది. అప్పట్నుంచి విద్యార్థులకు హోమ్ వర్క్ తప్పడం లేదని చెబుతూంటారు. 


అమెరికాలో ప్రారంభమైన ఈ హోమ్ వర్క్ తర్వాత ప్రపంచం మొత్తం విస్తరించింది. అయితే ఇది రాను రాను వెర్రి తలలు వేసింది. రాత్రంతా కూర్చుని వర్క్ చేసినా పూర్తికానంత ఇవ్వడం ప్రారంభించారు. దీంతో ఇండియాలో హోమ్ వర్క్‌పై వ్యతిరేకత ప్రారంభమయింది. దీన్ని బ్యాన్ చేయాలన్న డిమాండ్లు కూడా వినిపిస్తూ ఉంటాయి. హోమ్ వర్క్ పిల్లలను ఒత్తిడికి గురి చేయడమేనని చెబుతూ ఉంటారు. కారణం  ఏదైనా హోమ్ వర్క్ తప్పడంలేదు. 


హోమ్ వర్క్ బాధితులందరికీ హోమ్ వర్క్ కనిపెట్టిన వారెవరో తెలిసిపోయింది కదా.. ఇక ప్రారంభిద్దామా ? అంటే.. ప్రారంభించడం అంటే.. మనం ఆయనను కానీ ఆయన పేరును కానీ ఏమీ చేయలేం.. ఆ స్టేజ్ దాటిపోయింది. ఇప్పుడు ఏమైనా చేయగలం అంటే.. అది హోమ్  వర్క్ చేసుకోవడమే.  చేసుకోవడమే బెటర్.