Ayushman Bharat Scheme:
ఆయుష్మాన్ భారత్
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ స్కీమ్‌పై ప్రశంసలు కురిపించారు. హెల్త్ కవరేజ్‌లో ఇండియా ముందుంటోందని కొనియాడారు. G20 సదస్సుని ఈ సారి ఇండియా లీడ్ చేస్తుండడంపై ఆనందం వ్యక్తం చేశారు.
"యూనివర్సల్ హెల్త్ కవరేజ్ విషయంలో భారత్ కృషిని అభినందించాల్సిందే. ప్రపంచంలోనే అతి పెద్ద హెల్త్ స్కీమ్ ఆయుష్మాన్ భారత్. ఈ స్కీమ్ ద్వారా మెరుగైన సేవలు అందుతున్నాయి. గాంధీనగర్‌లోని హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్‌ని సందర్శించాను. ప్రాథమిక ఆరోగ్య సేవలు చాలా మెరుగ్గా ఉన్నాయి. హెల్త్‌కేర్‌లో మార్పులకు ఇదే నిదర్శనం. గుజరాత్‌లో టెలీమెడిసిన్ సేవలు కూడా చురుగ్గా సాగుతుండటం గొప్ప విషయం. గ్లోబల్ డిజిటల్ హెల్త్ ఇనిషియేటివ్‌ని భారత్ ప్రారంభిస్తున్నందుకు మా అభినందనలు"
- డాక్టర్ టెడ్రోస్ అధనామ్, డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్
ఇటీవలే కేంద్ర ఆరోగ్యమంత్రి మన్‌సుఖ్ మాండవీయ కీలక విషయాలు వెల్లడించారు. పలు దేశాలకు చెందిన 70 మంది ప్రతినిధులు G20 Health Ministers మీటింగ్‌కి హాజరవుతారని చెప్పారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఈ సదస్సు జరుగుతోంది.
"భారత్ హెల్త్ మోడల్ గురించి ఆయా దేశాల ప్రతినిధులకు వివరిస్తున్నాం. ఇది విన్న వాళ్లంతా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టారు:"
- మన్‌సుఖ్ మాండవీయ, కేంద్ర ఆరోగ్యమంత్రి
రెండు రోజుల సదస్సు
ఆగస్టు 17న గుజరాత్‌లో ఈ సదస్సు మొదలు కాగా నేటితో (ఆగస్టు 19) ముగియనుంది. ఈ సదస్సులో మూడు కీలక అంశాలపై చర్చించారు. హెల్త్ ఎమర్జెన్సీ సేవలు మెరుగు పరచడం, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్‌ని సాధించడం, ఫార్మా సెక్టార్‌లో కో ఆపరేషన్‌ని బలోపేతం చేయడం లాంటి అంశాలు చర్చకు వచ్చాయి. వైద్య సేవలు అందరికీ అందుబాటులో ధరలో ఉండేలా చూడడంపైనా ప్రతినిధులు తమ అభిప్రాయాలు వెల్లడించారు.