Watch Video: 



ఉదయన్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు 


బెంగళూరులోని సంగొల్లి రాయణ్ణ రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫామ్‌పై ఆగి ఉన్న ఉదయన్ ఎక్స్‌ప్రెస్‌లో (Udayan Express) నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్టేషన్‌లోని ప్రయాణికులతో సహా సిబ్బంది కూడా ఉలిక్కిపడ్డారు. ప్రయాణికులంతా దిగిపోయిన రెండు గంటల తరవాత ఈ ప్రమాదం జరిగింది. ఫలితంగా ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని South-Western Railway అధికారులు వెల్లడించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఉదయం7.30 గంటలకు పెద్ద ఎత్తున మంటలు వచ్చాయి. స్టేషన్ అంతా పొగ కమ్ముకుంది. రెండు కోచ్‌లు మంటల్లో తగలబడిపోయాయి. ప్రమాదానికి కారణమేంటన్నది ఇంకా తెలియరాలేదు.