Pak Anchor Nadia Khan: పహల్గాం దాడిని పాక్ సైన్యం సాయంతో ఉగ్రవాదులు పూర్తి చేశారు. ఇప్పుడు అది పాకిస్తాన్ కు పెను ముప్పు తెచ్చి పెట్టింది. పాకిస్తాన్ సైన్యం ఓవరాక్షన్ తో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. అయితే పాకిస్తాన్ లో కూడా ఇలాంటి ప రిస్థితుల్లో సీరియస్ కామెడీ పండించేవాళ్లు పెరిగిపోయారు. అలాంటి వారిలో నటి, టీవీ యాంకర్ అయిన నదియా ఖాన్ ఒకరు. 

ఆమె యాంకర్ సీట్లో కూర్చునే నవరసాలు  పండిస్తూ వార్తలు చదివింది.  ఏడ్చింది.. కోపగించుకుంది. ఆవేశపడింది. కావాలంటే ఆ వీడియో మీరే చూడండి. 

నదియా ఖాన్ ఇంత బాగా ఒక్క వీడియోలు హావభావాలు పండించారంటే ఖచ్చితంగా ఆమె  న్యూస్ యాంకర్ మాత్రమే కాదు మంచి నటిగా ఎదిగిపోయి ఉంటారని ఎవరైనా అనుకుంటారు.  కానీ ఆమె నటిగా ఎదుగలేదుకానీ.. నటినే.  ఎంటర్ టెయిన్ మెంట్ ఇండస్ట్రీలో తన ముద్ర వేయడానికి ప్రయత్నించారు కానీ..  ఆ దూకుడును తట్టుకోలేక ఎవరూ పెద్దగా చాన్సులివ్వలేదు. అందుకే బాగా ఫ్రస్ట్రేషన్ కు గురయ్యారేమో కానీ ఇప్పుడు సందు దొరికిందని పాక్ సెలబ్రిటీలందర్నీ దున్ని పడేశారు. 

 మిగతా అందరు సెలబ్రిటీలు సరే.. ముందు ఈ స్వయం ప్రకటిత మీడియా సెలబ్రిటీ దేశం కోసం ఏం చేశారన్న ప్రశ్నలు వస్తున్నాయి. కానీ తాను ప్రశ్నించానని ఈమె కవర్ చేసుకుంటున్నారు.  

ఇటీవలి కాలంలో చాలా మంది పాక్ సెలబ్రిటీలు అక్కడి కన్నా ఇండియాలో పని చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటున్నారు.  దీంతో చాలా మంది భారత్ కు వ్యతిరేకంగా కా మెంట్స్ చేయడానికి ఆసక్తి చూపించడం లేదు. బాలీవుడ్  లో చాన్స్ వస్తే తమ లైఫ్ సెటిల్ అయిపోతుందని వారు అనుకుంటున్నారు.  నదియా ఖాన్ కు అలాంటి అవకాశాలు లేవు కాబట్టి ఆమె రెచ్చిపోతున్నారని.. ఇతర సెలబ్రిటీలు మనసులో తిట్టుకుంటున్నారు.