WhatsApp Unable To Upload Status: యూపీఐతో పాటు వాట్సాప్ కూడా తరచూ సమస్యలు సృష్టిస్తోంది. శనివారం వాట్సాప్ పని చేయడం లేదని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తున్నారు. తమ స్టేటస్‌లను అప్‌లోడ్ చేయడంలో లేదా సందేశాలను పంపడంలో కొంతమంది వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంతరాయాలను ట్రాక్ చేసే డౌన్‌డిటెక్టర్ ప్రకారం, సాయంత్రం 5:22 గంటల వరకు వాట్సాప్‌పై కనీసం 597 ఫిర్యాదులు నమోదయ్యాయి. వాటిలో, 85% ఫిర్యాదులు సందేశాలను పంపడానికి సంబంధించినవి, 12% మంది యాప్‌లో ఇబ్బందులు ఎదుర్కొన్నారు మరియు 3% మంది లాగిన్ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
కొంతమంది వినియోగదారులు వాట్సాప్‌లో తమ స్టేటస్‌లను అప్‌లోడ్ చేయలేకపోయారు, మరికొందరు గ్రూపులలో సందేశాలు పంపేటప్పుడు ఎర్రర్‌లను నివేదించారు. ప్లాట్‌ఫామ్‌లో ఎక్కువ మంది సమస్యలను చెప్పడంతో సోషల్ మీడియా వినియోగదారులు మళ్లీ #Whatsappdown హ్యాష్ ట్యాగ్ ని ఉపయోగించడం ప్రారంభించారు.
చాలా మంది తనకు మాత్రమే సమస్య ఉందా అందరికీ ఉందా అని వాకబు చేయడం ప్రారంభించారు. ఇది iOS 18.4తో సమస్య అని నేను అనుకున్నాననని.. తన ఫోన్‌ను రీస్టార్ట్ చేసి వాట్సాప్ స్టేటస్‌ను అప్‌లోడ్ చేయడానికి ప్రయత్నించాను, కానీ అది పని చేయలేదు. తర్వాత నేను దానిని గూగుల్‌లో వెతికి, వాట్సాప్ డౌన్ అయిందని తెలుసుకున్నానని కొంత మంది తమ అనుభవాన్ని వివరించారు.
ఈ అంతరాయం గురించి వాట్సాప్ నుండి ఎలాంటి విరవణ రాలేదు. కొంతమంది వినియోగదారులు ఫేస్‌బుక్ , ఇన్‌స్టాగ్రామ్‌లో మెటాకు ఫిర్యాదులు చేశారు. 530 మిలియన్లకు పైగా భారతీయులు వాట్సాప్‌ను ఉపయోగిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3 బిలియన్ల మంది వాట్సాప్ వాడుతున్నారు.
వాట్సాప్ డౌన్ కారణంగా చాలా మంది మీమ్స్ రెడీ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.