Puri Ratna Bhandar Opening: పూరీ జగన్నాథుని ఆలయంలోని రత్న భాండాగారంపై (Ratna Bhandar) దేశవ్యాప్తంగా ఆసక్తికర కథలు వినిపిస్తున్నాయి. లోపల ఎవరూ ఊహించనంత సంపద ఉందని, ఆ నిధులకు విష సర్పాలు కాపలా కాస్తున్నాయని కొందరు చెబుతున్నారు. అందుకే అధికారులు గదిని తెరిచేందుకు భయపడుతున్నారు. అయితే...ఈ భాండాగారాన్ని (Puri Jagannath Temple) తెరిచేందుకు ఓ SOPని అనుసరించాలని నిర్ణయం తీసుకుంది. ఇవన్నీ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు. మరి 46 ఏళ్ల క్రితం ఈ భాండాగారాన్ని తెరిచినప్పుడు ఏం జరిగింది..? లోపల ఏముంది..? అందరూ అనుకుంటున్నట్టుగానే విష సర్పాలు కనిపించాయా..? వజ్రాలు వైఢుర్యాలు ఉన్నాయా..? ఇలా ఎన్నో ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.


ఈ భాండాగారంపై ఎన్నో ఏళ్లుగా ఇలాంటి కథలు వినిపిస్తూనే ఉన్నాయి. దీని గురించి తెలుసుకోడానికే 1978లో తొలిసారి తెరిచారు. అప్పుడే ఆ భాండాగారంలో (Ratna Bhandar Opening) ఏమున్నాయో గుర్తించారు. సంపదను లెక్కించే ప్రయత్నం (Ratna Bhandar Mystery) చేశారు. ఈ గది లోపల బంగారం, వెండి, వజ్రాలు, ముత్యాలతో పాటు రకరకాల ఆభరణాలు కనిపించాయి. 1978 మే 13వ తేదీన మొదలైన లెక్కింపు ప్రక్రియ జులై 23వ తేదీ వరకూ కొనసాగింది. దాదాపు 70 రోజుల పాటు శ్రమించిన సిబ్బంది చివరకు లెక్క తేల్చారు. 


ఇదీ జాబితా..


స్టోర్‌ హౌజ్‌లో 367 రకాల బంగారు ఆభరణాలున్నాయి. వాటి బరువు 4,360 గ్రాములు. వీటితో పాటు 14,828 గ్రాముల బరువైన 231 వెండి వస్తువులను గుర్తించారు. మరో స్టోర్‌హౌజ్‌లో 87 రకాల బంగారు ఆభరణాలు కనిపించాయి. వీటి బరువు 8,740 గ్రాములు. రెండో స్టోర్‌హౌజ్‌లో బంగారు ఆభరణాలతో పాటు వెండి వస్తువులూ (What is inside Ratna Bhandar) పెద్ద ఎత్తున కనిపించాయి. 7,321 గ్రాముల బరువైన 62 వెండి వస్తువులున్నట్టు లెక్క తేల్చారు. మొత్తంగా చూస్తే రత్న భాండార్‌లో  12,831 గ్రాముల బంగారం, 22,153 గ్రాముల వెండి ఉందని లెక్క తేలింది. ఇదే విషయాన్ని 2021లో న్యాయ శాఖా మంత్రి ప్రతాప్ జేనా అసెంబ్లీ సాక్షిగా వెల్లడించారు. అయితే...ఈ మొత్తం సంపద విలువ ఎంత అన్నది మాత్రం తేలలేదు. ఈ విషయాన్ని ప్రభుత్వమూ వెల్లడించలేదు. రహస్య గదిని తెరిచి ఈ ఆభరణాలను గుర్తించారు. అయితే...ఇప్పుడు మరోసారి తెరిచి పూర్తిస్థాయిలో మిస్టరీని ఛేదించాలని భావిస్తోంది బీజేపీ ప్రభుత్వం. ఇన్నాళ్లూ ఈ భాండాగారంపై వస్తున్న వదంతులకు ఫుల్‌స్టాప్‌ పెట్టి ఓ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. 


తాళం చెవిపైనా వివాదం..


2018లో రత్న భాండాగారం తాళం చెవి (Ratna Bhandar Key Missing) కనిపించకుండా పోవడం సంచలనం సృష్టించింది. ఈ తాళానికి డూప్లికేట్ మాత్రమే ఉంది. దీనిపై ఎన్నో అనుమానాలు వ్యక్తమయ్యాయి. రాజకీయంగానూ ఈ వ్యవహారం దుమారం రేపింది. జ్యుడీషియల్ కమిషన్‌ ఏర్పాటై దీనిపై విచారణ చేపట్టింది. అప్పటి నుంచి ఈ తాళం చెవి గురించి చర్చ జరుగుతూనే ఉంది. ఇటీవల ఒడిశా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ తాళం గురించి ప్రస్తావించడం వల్ల మరోసారి ఈ వివాదం తెరపైకి వచ్చింది. ఆరేళ్లుగా తాళం కనిపించకుండా పోయినా ప్రభుత్వం ఏమీ పట్టించుకోలేదని విమర్శించారు. తమిళనాడుకి ఈ తాళాన్ని పంపించారంటూ ఆరోపించారు. ఈలోగా ఎన్నికల ఫలితాలు వచ్చి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఆలయ సంస్కరణలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. అందులో భాగంగానే రత్న భాండాగారాన్ని తెరిపిస్తోంది. 


Also Read: Puri Ratna Bhandar: పూరీ రత్న భండార్‌పై పెరుగుతున్న ఉత్కంఠ, ఎలా తెరవాలో ప్లాన్ సిద్ధం చేస్తున్న ప్రభుత్వం