Precautions During Thunderstorms: వానాకాలం మొదలైంది అంటే పిడుగులు  పడే సీజన్ ప్రారంభమవుతుంది. కనుక ముఖ్యంగా పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశువుల, గొర్రె కాపరులు జాగ్రత్తగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. పిడుగుపాటు మరణాలు ఎక్కువ చెట్లక్రింద,పొలాల్లో, బహిరంగ ప్రదేశాల్లో ఉండటం వలన సంభవిస్తున్నాయని పేర్కొన్నారు.


Thunderstorm Definition: ఆకాశములో సహజ సిద్ధంగా ఉత్పన్నమయిన విద్యుత్‌పాతాన్ని పిడుగు అని పిలుస్తారు. ఆకాశంలో మేఘాలు ఢీకొన్నప్పుడు వెలువడే కాంతిని మెరుపు అంటాం, శబ్దాన్ని ఉరుము అని.. ఆ సమయంలో ఉత్పన్నమయ్యే విద్యుత్తును పిడుగు అని అంటారు.


పిడుగుపాటుకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే.. (Thunderstorm Lightning Dos)
ఉరుములు, మెరుపులో కూడిన వర్షం పడుతున్నప్పుడు ఇంట్లోనే ఉండండి
సముద్రము, కొలనులు, సరస్సులు, చెరువుల దగ్గర ఉంటే వెంటనే వాటికి దూరంగా వెళ్లాలి. రేకు, లోహము కలిగిన నిర్మాణాలకు దూరంగా ఉండాలి
ఉరుమలు శబ్ధం వినగానే పొలాల్లో పనిచేసే రైతులు, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసేవారు, పశువుల కాపరులు, గొర్రెల కాపరులు వెంటనే సురక్షితమైన ప్రదేశానికి వెళ్లాలి
కారు, బస్సు లాంటి వాహనాల లోపల ఉన్నట్లయితే వెంటనే అన్ని డోర్స్ మూసి ఉంచాలి
ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ఉన్నప్పుడు మీ మెడ వెనుక జట్టు నిక్కబొడుచుకోవడం గానీ, చర్మం జలదరింపు ఉంటే మెరుపు, పిడుగు రావడానికి సూచనగా భావించండి
బహిరంగ ప్రదేశాల్లో ఉండి సురక్షిత ప్రాంతాలకు వెళ్లే అవకాశం లేకుండా రబ్బరు చెప్పులు ధరించి చెవులు మూసుకుని.. తలను నేలకు తగలకుండా మోకాలిపై కూర్చోండి. దీని వలన ఉరుములు, మెరుపులు నుంచి రక్షణ పొందే అవకాశం ఉంటుంది
ఒకవేళ మీరు ఇంట్లో ఉన్నట్లయితే కిటీకీలు, తలుపులు మూసివేయండి. ఉరుముల శబ్ధం ఆగిపోయిన తరువాత కూడా 30 నిమిషాల వరకు ఇంట్లోనే ఉండి రక్షణ పొందండి
పిడుగు బాధితులను తాకవచ్చు. వెంటనే వారికి సహాయం అందించండి
పిడుగు బాధితుడిని వెంటనే దగ్గర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి గానీ, ఏదైనా ఆసుప్రతికి తరలించండి


పిడుగుపాటు సమయంలో చేయకూడనివి.. (Thunderstorm & Lightning Don'ts)
ఉరుములు, మెరుపులు సంభవించినప్పుడు చెట్ల కింద, చెట్ల సమీపంలో, ఏవైనా టవర్లు, చెరువులు దగ్గర ఉండరాదు
ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇతర పరికరాలు ఛార్జింగ్ పెట్టిన ఫోన్లు, మొబైల్స్ వాడరాదు
పిడుగుల సమయంలో స్నానం చేయడం, చేతులు కడగటం, నీటిలో ఉండటం లాంటివి చేయకూడదు
మోటారు సైకిళ్లు, ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లు వేలాడుతున్న విద్యుత్ తీగలకు, విద్యుత్ స్తంభాలకు, ఇనుప వస్తువులకు దూరంగా ఉండాలి
వాహనంలో ఉన్నట్లయితే లోహపు భాగాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తాకరాదు అని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ ఈ జాగ్రత్తలు సూచించారు.