ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది వచ్చే పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి క్రమంగా దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య భాగాలపై ప్రభావం చూపించనుంది. 3 రోజుల్లో పశ్చిమ-వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల వైపు వెళ్లే అవకాశం ఉంది.


నవంబర్ 20 నుంచి భారీ వర్షాలు పడొచ్చని అంచనా వేసింది. ఉత్తర కోస్తా తమిళనాడు-పుదుచ్చేరి, కారైకాల్ మీదుగా చాలా ప్రదేశాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. నవంబర్ 20, 21 &22 తేదీల్లో ఉత్తర కోస్తా తమిళనాడు-పుదుచ్చేరి, కారైకాల్, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ & రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలతో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవవచ్చు. 40-45 kmph నుంచి 55 kmph వేగంతో గాలులు కూడా వీస్తాయి. 


సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది. చాలా ఉధృతంగా ఉంటుంది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు. అండమాన్ & నికోబార్ దీవుల మీదుగా కొన్ని ప్రదేశాల్లో, కేరళ & మాహేలో కొన్ని ప్రదేశాలలో ఉరుములతో కూడిన జల్లులు పడొచ్చు. 






తెలంగాణలో వాతావరణం


తెలంగాణలో వాతావరణం పొడిగా ఉంటుంది కానీ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఒకట్రెండు ప్రాంతాల్లో 21, 22 తేదీల్లో చిరుజల్లులు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నారాయణపేట, జోగులాంబ గద్వాల్‌, వనపర్తి, నాగర్‌కర్నూల్‌ నల్గొండ, సూర్యపేట, ఖమ్మం జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు వర్ష సూచన ఉంది.  తగ్గిన ఉష్ణోగ్రతలు కారణంగా చలి మాత్రం ప్రజలను ఇబ్బంది పెట్టనుంది. తెలంగాణలో అత్యధిక ఉష్ణోగ్రత ఖమ్మంలో 32.6 డిగ్రీలుగా ఉంటే...  తక్కువ ఉష్ణోగ్రత మెదక్‌్లో 12 డిగ్రీలుగా నమోదైంది. 







జమ్మకశ్మీర్, లడఖ్, గిల్గిత్ బాల్టిస్తాన్ & ముజఫరాబాద్‌, హిమాచల్ ప్రదేశ్‌లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం/మంచు కురిసే అవకాశం ఉంది.


కర్ణాటకలోని అనేక ప్రదేశాల్లో సాధారణం కంటే (-3.1°C నుంచి -5.0°C) గణనీయంగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. తెలంగాణపై కొన్ని చోట్ల; తమిళనాడు, పుదుచ్చేరి & కారైకాల్, కోస్తా ఆంధ్ర ప్రదేశ్ & యానాం, రాయలసీమ, హర్యానా, చండీగఢ్ & ఢిల్లీలో చాలా ప్రదేశాల్లో సాధారణం కంటే తక్కువ (-1.6°C నుంచి -3.0°C) ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాియ. దేశంలోని మైదానాల్లోని చురు (పశ్చిమ రాజస్థాన్)లో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత 7.0°C గా నమోదైంది. కార్వార్ (కోస్టల్ కర్ణాటక)లో అత్యధికంగా 35.8°C ఉష్ణోగ్రత నమోదైంది. రాబోయే 3 రోజులలో వాయువ్య భారతదేశంలోని చాలా ప్రాంతాలలో కనిష్ట ఉష్ణోగ్రతల్లో గణనీయమైన మార్పు ఏమీ ఉండదు.