WB By-Election Voting LIVE: ప్రశాంతంగా ముగిసిన ఉపఎన్నికల పోలింగ్.. అక్టోబర్ 3న ఫలితాలు

బంగాల్‌లో మూడు స్థానాల్లో ఉపఎన్నికలు జరుగుతున్నాయి. అయితే అందరి దృష్టి మమతా బెనర్జీ పోటీ చేస్తోన్న భవానీపుర్ స్థానంపైనే ఉంది. అక్టోబర్ 3న ఫలితాలు వెల్లడించనున్నారు.

ABP Desam Last Updated: 30 Sep 2021 07:47 PM
ప్రశాంతంగా ముగిసిన పోలింగ్..

బంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బరిలో ఉన్న భవానీపుర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉపఎన్నిక ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 53.32 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. చెదురుమదురు ఘటనలు మినహా ఓటింగ్​ ప్రశాంతంగా ముగిసింది.

భవానీపుర్‌లో ఘర్షణ..

భవానీపుర్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భాజపా, టీఎంసీ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. భాజపా నేత కల్యాణ్ చౌబే కారును ఆందోళనకారులు ధ్వంసం చేశారు.


 





దీదీ ఓటు..

భవానీపుర్‌ ఉపఎన్నికల్లో తన ఓటు హక్కును సీఎం మమతా బెనర్జీ ఉపయోగించుకున్నారు. మిత్రా ఇన్‌స్టిట్యూట్ పోలింగ్ కేంద్రం ఓటు వేశారు.





48.08% శాతం

భవానీపుర్‌లో ఓటింగ్ మందకొడిగా సాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 48.08% మాత్రమే ఓటింగ్ నమోదైంది. సంసేర్‌గంజ్‌లో 72.45%, జంగీపుర్‌లో 68.17% ఓటింగ్ నమోదైంది.

మందకొడిగా పోలింగ్..

భవానీపుర్‌లో ఓటింగ్ మందకొడిగా సాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు 35.97 శాతం మాత్రమే ఓటింగ్ నమోదైంది. సంసేర్‌గంజ్‌లో 57.15 శాతం, జంగీపుర్‌లో 53.78 శాతం ఓటింగ్ నమోదైెంది. 

భవానీపుర్‌లో 21.73% ఓటింగ్..



బంగాల్ ఉపఎన్నికల ఓటింగ్ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు సంసేర్‌గంజ్‌లో 40.23%, జాంగీపుర్‌లో 36.11%, భవానీపుర్‌లో 21.73% ఓటింగ్ నమోదైంది.




బీజేడీ అభ్యర్థి ఓటు..

ఒడిశా పిపిలీ నియోజకవర్గంలో బిజు జనతాదళ్ అభ్యర్థి రుద్ర ప్రతాప్ మహారథి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.





90 ఏళ్ల వృద్ధురాలు..

భవానీపుర్ నియోజకవర్గంలో 90 ఏళ్ల వృద్ధురాలు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.





మిగిలిన స్థానాల్లోనూ..

జాంగీపుర్‌, సంసేర్‌గంజ్‌ అసెంబ్లీ స్థానాల్లోనూ పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. కరోనా నిబంధనలకు లోబడి ఓటింగ్ సాగుతోంది.





Background

బంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేస్తోన్న భవానీపుర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్​ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. తెల్లవారుజామునే పోలింగ్​ కేంద్రాలకు ఓటర్లు తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు.


జాంగీపుర్‌, సంసేర్‌గంజ్‌ అసెంబ్లీ స్థానాలకు కూడా ఇవాళ ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్‌ నుంచి ఓటమిపాలైన దీదీ ఈ ఉపఎన్నికలో భవానీపుర్‌ నుంచి పోటీ చేస్తున్నారు. దీదీకి పోటీగా భాజపా నుంచి న్యాయవాది ప్రియాంక టిబ్రివాల్‌ బరిలో ఉన్నారు. అక్టోబర్‌ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది.  ఒడిశాలోని పిపిలీ నియోజకవర్గంలో కూడా నేడు పోలింగ్ జరుగుతోంది.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.