US Woman Divorce Celebration:
డైవర్స్ ఫోటో షూట్
పెళ్లిని ఎవరైనా సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ డైవర్స్‌ని కూడా సెలబ్రేట్ చేసుకునే వాళ్లున్నారు. అమెరికాలో ఓ మహిళ ఇదే చేసింది. భర్తతో విడాకులు అయిన ఆనందంలో ఆమె చేసిన పని అందరినీ షాక్‌కి గురి చేసింది. వెడ్డింగ్ డ్రెస్‌ని మంటల్లో వేసి కాల్చేసింది. అంతటితో ఆగలేదు. పెళ్లి ఫోటోలనూ కాళ్ల కింద వేసి తొక్కేసింది. చిల్డ్ బీర్ తాగుతూ ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. "డైవర్స్‌ని ఇలా కూడా సెలబ్రేట్ చేసుకుంటారా" అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. లారెన్ బ్రూక్ (Lauren Brooke) అనే మహిళ 2012 అక్టోబర్‌లో ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుంది. మనస్పర్దలతో 2021లో ఇద్దరూ విడిపోయారు. అయితే అమెరికా చట్ట ప్రకారం విడాకులు తీసుకునే ఓ ఏడాది ముందు వరకూ ఇద్దరూ వేరు వేరుగా ఉండాలి. ఆ తరవాతే డైవర్స్‌కి అప్లై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా జరగడానికి ఏడాది పట్టింది. ఈ ఏడాది జనవరిలో మొత్తానికి ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ఈ ఆనందాన్ని ఎలాగైనా సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంది లారెన్. తన తల్లికి, బెస్ట్ ఫ్రెండ్‌కి ఇదే చెప్పింది. ఆ తరవాత ముగ్గురూ కలిసి ఆలోచించి ఓ ప్లాన్ చేశారు. వెడ్డింగ్ డ్రెస్‌ని కాల్చేస్తూ ఫోటోలు తీసుకోవాలని సలహా ఇచ్చారు. అలా అనుకుందే తడవుగా ఇంటి బయటకు వచ్చి లాన్‌లో వెడ్డింగ్ డ్రెస్‌ని పడేసి మంటల్లో కాల్చేసింది లారెన్. అదే ప్లేస్‌లో ఫోటోలు దిగింది. "Divorced" అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
"విడాకులు తీసుకోవడం ఎంత కష్టమో తెలిసొచ్చింది. చాలా బాధను అనుభవించాను. ఎన్నో రోజుల పాటు నరకం చూశాను. ఉదయమే లేచి ఏడ్చేదాన్ని. నా లైఫ్ ఇక్కడితోనే ఆగిపోతుందేమో అనుకున్నాను. కానీ అలా జరగలేదు. ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను. మేం విడాకులు తీసుకున్నాం. కానీ మా పిల్లల కోసం మాత్రం అప్పుడప్పుడు కలుసుకోక తప్పడం లేదు. ఇప్పుడిక నేను ఏడ్వాల్సిన అవసరం లేదు. చాలా ప్రశాంతంగా ఉంది"
- లారెన్ బ్రూక్, విడాకులు తీసుకున్న మహిళ
కొన్ని సార్లు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని, ఆ తరవాత ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో అర్థం కాక సతమతం అవుతామని చెబుతోంది లారెన్. ఇన్నాళ్లూ మానసికంగా చాలా వేదనకు గురయ్యానని అంటోంది.
"ఏమైనా సరే లైఫ్ ఎక్కడా ఆగదు. కొన్ని సార్లు కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు. పరిణామాలు ఎలా ఉన్నా సరే తట్టుకోవాల్సి ఉంటుంది. విడిపోవాలి అని చాలా గట్టిగా నిర్ణయం తీసుకున్నాను. చాలా రోజుల పాటు అది వర్కౌట్ కాలేదు. అయినా సరే నేను కుంగిపోలేదు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటానని గట్టిగా నమ్మాను. ఫైనల్‌గా నేను అనుకుందే జరిగింది. సంతోషంగా ఉంది"
- లారెన్ బ్రూక్, విడాకులు తీసుకున్న మహిళ
Also Read: Water Metro in India: పడవల్లాంటి మెట్రోలు వచ్చేస్తున్నాయ్,మన దేశానికే ఇది వెరీ స్పెషల్