Viral Video: 


15 అడుగుల కోబ్రా 


పాములు ఎప్పుడు ఎక్కడ దూరతాయో తెలీదు. మనం చాలా క్యాజువల్‌గా పని చేసుకుంటుంటే సడెన్‌గా కనిపిస్తాయి. బైక్‌లు, కార్లలో దూరి హడలెత్తించిన ఘటనలు ఎన్నో జరిగాయి. ఇప్పుడు మరోసారి అలాంటిదే జరిగింది. ఓ 15 అడుగుల కోబ్రా కార్‌ కిందకు దూరింది. వాతావరణం చల్లగా ఉండడం వల్ల వెచ్చదనం కోసం కార్‌ కిందకు వెళ్లింది. కార్ ఓనర్ ఇది చూసి జడుసుకున్నాడు. వెంటనే స్నేక్ క్యాచర్‌ని పిలిచాడు. ఆ వ్యక్తి చాలా కష్టపడి మొత్తానికి దాన్ని సురక్షితంగా బయటకు తీశాడు. మళ్లీ అడవిలోకి వదిలాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. కింగ్‌ కోబ్రాను పట్టుకోవడం అంటే మాటలు కాదు. ఏ మాత్రం తేడా వచ్చినా ప్రాణాలు పోతాయ్. అయినా చాలా ధైర్యంగా చాకచక్యంగా దాన్ని పట్టుకున్నాడు స్నేక్ క్యాచర్. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుశాంత నంద ఈ వీడియోని షేర్ చేశారు. 15 అడుగుల కోబ్రాను కాపాడినట్టు ట్వీట్ చేశారు. 


"నేచర్‌ బ్యాలెన్సింగ్‌లో కీలకమైన కింగ్ కోబ్రాలను కాపాడుకోవటం మన బాధ్యత. అందుకే కార్‌ కింద దూరిన 15 అడుగుల కోబ్రాను సేఫ్‌గా బయటకు తీశాం. పాములు పట్టుకోవడంలో ఎక్స్‌పర్ట్ అయిన వ్యక్తినే పంపించాం. ఇలాంటి సాహసాలు మాత్రం మీరు చేయకండి. వర్షాలు పడినప్పుడు వెచ్చదనం కోసం ఇలా ఎక్కడపడితే అక్కడ తల దాచుకుంటాయి" 


- సుశాంత నంద, ఫారెస్ట్ ఆఫీసర్ 


ముందు అది తప్పించుకోకుండా జాగ్రత్తగా పట్టుకున్నాడు. అలా మెల్లగా అటూ ఇటూ తిప్పుతూ ఓ సంచివైపు దాన్ని తీసుకెళ్లాడు. వెంటనే అది అందులోకి వెళ్లిపోయింది. ఆ తరవాత దాన్ని అడవిలోకి వదిలాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ వ్యక్తిని తెగ పొగిడేస్తున్నారు. ఏ మాత్రం భయం లేకుండా అలా ఎలా పట్టుకున్నాడో అంటూ ఆశ్చర్యపోతున్నారు.