Putin Visits Mariupol:


మరియుపోల్‌లో పర్యటన..


రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ అరెస్ట్ వారెంట్ జారీ చేయడం అంతర్జాతీయంగా చర్చకు దారి తీసింది. ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలిచే దేశాలన్నీ ఈ నిర్ణయాన్ని సమర్థించాయి. అటు రష్యా మాత్రం ఈ నిర్ణయం చెల్లదని తేల్చి చెప్పింది. దీనిపై వాడి వేడి చర్చలు జరుగుతుండగానే పుతిన్‌..రష్యా ఆక్రమిత  మరియుపోల్‌లో పర్యటించటం మరింత సంచలనమైంది. చాన్నాళ్ల యుద్ధం తరవాత ఈ పోర్ట్‌ను ఆక్రమించుకుంది రష్యా. అప్పటి నుంచి పుతిన్ ఇటువైపు రాలేదు. తనపై అరెస్ట్ వారెంట్ జారీ చేసిన వెంటనే ఇక్కడికి వచ్చి పర్యటించి వాతావరణాన్ని వేడెక్కించారు. అంతకు ముందు క్రిమియాలోనూ పర్యటించారు. క్రిమియాలో రష్యా, ఉక్రెయిన్‌ మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఆ మధ్య ఇదే ప్రాంతంలోని బ్రిడ్జ్‌పై బాంబు దాడి జరిగింది. ఇది కచ్చితంగా ఉక్రెయిన్ పనే అని రష్యా ఆరోపించింది. గట్టిగా బదులు చెబుతామని చెప్పింది. ఆ తరవాత ఉక్రెయిన్‌పై దాడుల తీవ్రత పెంచింది. కీలక నగరాలపై క్షిపణుల వర్షం కురిపిస్తోంది. ఉక్రెయిన్‌లో ఎక్కడ చూసినా శిథిలాలే కనిపిస్తున్నాయి.